Actress : ఈ ఫోటోలో చిన్నారి ఎవరో గుర్తుపట్టండి.. ఫ్యాన్స్ ముద్దుగా పిలుచుకునే పేరుతో పాట కూడా ఉంది..

August 20, 2022 3:24 PM

Actress : తమకిష్టమైన హీరో, హీరోయిన్ల‌ ఫోటోలను అభిమానులు భద్రంగా దాచుకుంటుంటారు. ఇక హీరోయిన్స్ చైల్డ్‌హుడ్ పిక్స్ గురించైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇవి తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. నెటిజన్లు కూడా తమ అభిమాన హీరోయిన్ల చిన్ననాటి ఫోటోలను గుర్తించేందుకు ఆసక్తిని కనబరుస్తుంటారు. సాయి పల్లవి, అనుష్క, శ్రియా, రాశి ఖన్నా.. ఇలా ఎందరో హీరోయిన్ల చైల్డ్ హుడ్ పిక్స్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఆ కోవలోనే తాజాగా మరో హీరోయిన్ చిన్ననాటి ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అమాయకంగా కనిపిస్తోన్న ఈ బుజ్జాయి తెలుగులో నటించిన తొలి సినిమాతోనే మంచి మార్కులు సంపాదించింది. ఆ తర్వాత మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సరసన నటించి బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కొట్టింది. ఇక మూడో సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని.. తన అందం, అభినయంతో కుర్రాళ్లను కట్టిపడేసింది. తన లేటెస్ట్ ఫొటోస్, సినిమా అప్డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌తో షేర్ చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతోంది. వరుసగా టాప్ హీరోల సినిమాల్లో ఛాన్స్‌లు దక్కించుకుంటోంది. మీకు ఈపాటికే ఆమె ఎవరో గుర్తొచ్చి ఉండాలే.. రాలేదా..!

have you identified Actress pooja hegde in this photo
Actress

ఈమెవరో కాదండీ.! బుట్టబొమ్మ పూజా హెగ్డే. ఒక లైలా కోసం సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన పూజా హెగ్డే.. ఆ తర్వాత నటించిన ముకుంద‌ సినిమాతో నటనలో మంచి మార్కులు కొట్టేసింది. ఇక దువ్వాడ జగన్నాథం సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇటీవల పూజా హెగ్డే నటించిన రాధేశ్యామ్, ఆచార్య, బీస్ట్ సినిమాలు ఫెయిల్యూర్ గా నిలిచాయి. ప్రస్తుతం పూజ హెగ్డే మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాతోనైనా పూజ వరుస పరాజయాల‌కు ఫుల్ స్టాప్ పడుతుందో లేదో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now