Viral Photo : చిరునవ్వులతో ఆకట్టుకుంటున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..?

August 19, 2022 3:19 PM

Viral Photo : ప్రస్తుతం త్రోబ్యాక్ ఫోటోస్ ట్రెండ్ నడుస్తోంది. సోషల్ మీడియాలో స్టార్ హీరో, హీరోయిన్స్ చిన్ననాటి ఫోటోస్ తెగ వైరల్ అవుతున్నాయి. ఇక తమ అభిమాన‌ నటీనటుల త్రోబ్యాక్ ఫోటోస్ చూస్తూ.. వారిని కనిపెట్టడానికి నెటిజన్స్ కూడా ఆసక్తిని చూపిస్తున్నారు. దీంతో సెలబ్రెటీలు కూడా తమ మధురమైన జ్ఞాపకాలు అంటూ చిన్నప్పటి ఫోటోస్, వీడియోస్ ను అభిమానులతో పంచకుంటున్నారు. అలా.. ఇప్పుడు నెట్టింట్లో సెలబ్రెటీస్ త్రోబ్యాక్ ఫోటోస్ చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఓ చిన్నారి ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

పైన ఫోటోలో బూరెబుగ్గలతో.. అమాయకపు చూపులు.. అందమైన చిరునవ్వుతో ఆకట్టుకుంటున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టండి చూద్దాం.. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను తన వైపుకు తిప్పుకుంది. ఇప్పుడు వరుస చిత్రాలతో బిజీగా టాప్ హీరోయిన్ రేసులో దూసుకుపోతోంది. గ్లామర్ పాత్రలైనా.. అచ్చమైన తెలుగింటి అమ్మాయిలా కనిపిస్తూ.. తన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తోంది. గతేడాది వరుస బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో థియేటర్లలో సందడి చేసింది. ఇప్పటికైనా ఈ చిన్నారి ఎవరో గుర్తొచ్చిందా..

Viral Photo priyanka jawalkar have you identified her
Viral Photo

ఇప్పటి వరకు ఈ ముద్దుగుమ్మ చేసిన సినిమాలు సూపర్ హిట్ అయినా.. ఎందుకో ఆశించనంతగా క్లిక్ కాలేకపోయింది. కానీ ఇటీవల వరుస చిత్రాల్లో నటిస్తూ కుర్రకారు ఫేవరేట్ హీరోయిన్ లిస్ట్ లో చేరిపోయింది. పైన ఫోటోలో ఉన్న చిన్నారి మరెవరో కాదండోయ్.. ప్రియాంక జవాల్కర్. రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన టాక్సీవాలా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది ప్రియాంక. గతేడాది తిమ్మరుసు, ఎస్ఆర్ కళ్యాణ మండపం, గమనం వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది ప్రియాంక.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now