Hari Teja : నటి హరితేజ గారాల పట్టిని చూశారా.. ఎంత ముద్దుగా ఉందో.. ఫోటోలు వైరల్!

October 8, 2021 1:47 PM

Hari Teja : బుల్లితెర యాంకర్ గా, సీరియల్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి హరితేజ గురించి మనందరికీ తెలిసిందే. బుల్లితెరపై ఎంతో సందడి చేసిన ఈమె వెండితెరపై పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఇలా ఈమెకు ఉన్న పాపులారిటీతో ఏకంగా బిగ్ బాస్ సీజన్ వన్ కంటెస్టెంట్ గా పాల్గొని మరింత పాపులారిటీ సంపాదించుకున్నారు.

Hari Teja daughter photos viral in social media

ఇలా బుల్లితెరపై, వెండితెరపై ఎంతో మంచి పేరు సంపాదించుకున్న హరితేజ 2015వ సంవత్సరంలో దీపక్ రావు అనే అతనిని వివాహం చేసుకుంది. కెరియర్ పరంగా, వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్న హరితేజ గత ఏడాది ఏప్రిల్ 5వ తేదీన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ క్రమంలోనే తన బిడ్డకు సంబంధించిన ఫోటోలను నిత్యం సోషల్ మీడియా ద్వారా పంచుకుంటోంది.

Hari Teja daughter photos viral in social media Hari Teja daughter photos viral in social media

తాజాగా హరితేజ తన ముద్దుల కూతురు భూమి దీపక్ రావు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇవి వైరల్ అవుతున్నాయి. ఫోటోలకు ఫోజులు ఇస్తూ ఎంతో బొద్దుగా ఉన్న హరితేజ కూతురి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment