Hari Teja : మహానటి సావిత్రిని కళ్లముందు చూపించిన హరితేజ.. వీడియో వైరల్..

September 19, 2022 5:02 PM

Hari Teja : ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది హరితేజ. అయితే హరితేజ మొదట సీరియల్స్ ద్వారా తన కెరీర్ ను ప్రారంభించింది. అంతేకాదు బుల్లితెర మీద ప్రసారమైన అనేక టీవీ షోలకు యాంకర్ గా కూడా వ్యవహరిస్తూ సందడి చేసింది. ఇలా యాంకర్, యాక్టర్ గా గుర్తింపు పొందిన హరితేజ బిగ్ బాస్ సీజన్ 1 లో కూడా పాల్గొంది. బిగ్ బాస్ లో హరితేజ హరికథ స్క్రిప్ట్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత హరితేజ ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు యాంకర్ గా వ్యవహరిస్తూ సందడి చేస్తోంది.

తాజాగా నవరాత్రి ధమకా అనే ప్రత్యేక కార్యక్రమంలో హరితేజ మహానటి సావిత్రిగా నటించింది. సావిత్రే నిజంగా మన కళ్లముందుకు వచ్చిందా? అనేంతలా.. హరితేజ ఆకట్టుకుంది. ఈ స్పెషల్ ఈవెంట్ కి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. దసరా పండగ సందర్భంగా మల్లెమాల వారు నవరాత్రి ధమాకా అనే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించున్నారు. ఈ కార్యక్రమానికి అలనాటి అందాల తారలు ప్రేమ, సంఘవి ముఖ్య అతిథులుగా వచ్చారు.

Hari Teja acted like savithri video viral
Hari Teja

ఈ కార్యక్రమంలో భాగంగా మాయా బజార్ సినిమాలో సావిత్రి చేసిన పాత్రను ఈ షోలో హరితేజ చేసింది. ఇంకా సావిత్రి నిజ జీవితంలో జరిగిన సంఘటనలు కూడా షోలో కళ్లకు కట్టినట్లుగా హరితేజ చూపించింది. ఆమె నటనకి అక్కడ ఉన్న వాళ్లంతా ఆశ్చర్యపోయారు. చనిపోయిన వాళ్లను గుర్తు చేయండం వేరు. నేరుగా వాళ్లే వచ్చినట్లు చేయడం వేరు. నాకు తెలిసి హరితేజ అలా చేసింది అని హైప‌ర్ ఆది.. హరితేజను ప్రశంసించాడు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment