Garlic : మనం నిత్యం తీసుకునే ఆహారమే మన ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది. మారుతున్న కాలాన్ని బట్టి నేటి యువత పోషకాలు ఉన్న ఆహార పదార్థాల కన్నా ఆరోగ్యానికి కీడు చేసే ఆహార పదార్థాల వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. మనం తినే ఆహారాలే మన ఆరోగ్యాన్ని కాపాడుతున్నాయనే వాస్తవాన్ని తెలుసుకోలేకపోతున్నారు. ఫలితంగా రోగాల బారిన పడుతూ వేలకు వేలు డబ్బులు ఆస్పత్రుల్లో ఖర్చు చేస్తూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. చెడు ఆహారపు అలవాట్లతో మన ఆరోగ్యాన్ని స్వయానా మనమే నాశనం చేసుకుంటున్నాం.
చెడు ఆహారపు అలవాట్ల వల్ల మనకు కలిగే నష్టాన్ని భర్తీ చేయాలి అంటే ప్రకృతి మనకు ఎన్నో ఔషధ గుణాలు కలిగిన ఆహారాలను ప్రసాదించింది. వాటిలో వెల్లుల్లి కూడా ఒకటి. వెల్లుల్లిలో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో మంచి గుణాలు ఉన్నాయి. ఇప్పుడు వెల్లుల్లి వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.
వెల్లుల్లి సీజనల ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది. మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచే ఔషధాల్లో వెల్లుల్లి కూడా ఒకటి అని చెప్పవచ్చు. అలాంటి వెల్లుల్లిని మనం సీజనల్ గా కాకుండా ప్రతి రోజు తీసుకుంటే ఎన్నో మంచి ఫలితాలు వస్తాయి. వెల్లుల్లిలో యాంటీ ఇన్ ఫ్లామేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నందున చర్మం మెరిసేందుకు దోహదపడుతుంది. వెల్లుల్లిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు దేహంలోని హానికరమైన బ్యాక్టీరియాను నియంత్రించడంలో సహకరిస్తాయి. చర్మం అందంగా, ఆరోగ్యంగా ఉండి వృద్ధాప్య ఛాయలను దరిచేరనివ్వదు.
రక్తపోటుకు సంబంధించిన సమస్యలు ఉన్నట్లయితే వెల్లుల్లిని తీసుకుంటే అధిక రక్తపోటును కూడా నియత్రిస్తుంది. రక్తనాళాలు రిలాక్స్ అయ్యేందుకు వెల్లుల్లి ఎంతో మేలు చేస్తుంది. మొటిమలు, కురుపులను కూడా నియంత్రిస్తుంది. జుట్టురాలే సమస్యతో బాధపడేవారికి కూడా వెల్లుల్లి ఎంతగానో ఉపయోగపడుతుంది. వెల్లుల్లి మొగ్గలను పేస్ట్ గా చేసి జుట్టు మూలాలపై పెరుగు లేదా తేనెతో కలిపి రాసుకుంటే జుట్టు రాలడం ఆగుతుంది. అందుకే మన పూర్వీకులు వెల్లుల్లి వంటి ఔషధగుణాలు ఉన్న ఆహార పదార్థాలు తినడం వలన ఆరోగ్యంగా జీవించేవారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…