Garlic : వెల్లుల్లి స‌క‌ల రోగ నివారిణి.. రోజూ తిన‌డం మ‌రిచిపోకండి..!

September 8, 2022 7:37 PM

Garlic : మనం నిత్యం తీసుకునే ఆహార‌మే మన ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది. మారుతున్న కాలాన్ని బట్టి నేటి యువత పోషకాలు ఉన్న ఆహార పదార్థాల కన్నా ఆరోగ్యానికి కీడు చేసే ఆహార పదార్థాల వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. మనం తినే ఆహారాలే మన ఆరోగ్యాన్ని కాపాడుతున్నాయనే వాస్తవాన్ని తెలుసుకోలేకపోతున్నారు. ఫలితంగా రోగాల బారిన పడుతూ వేలకు వేలు డబ్బులు ఆస్పత్రుల్లో ఖర్చు చేస్తూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. చెడు ఆహారపు అలవాట్లతో మన ఆరోగ్యాన్ని స్వయానా మనమే నాశనం చేసుకుంటున్నాం.

చెడు ఆహారపు అలవాట్ల వల్ల మనకు కలిగే నష్టాన్ని భర్తీ చేయాలి అంటే ప్రకృతి మనకు ఎన్నో ఔషధ గుణాలు క‌లిగిన ఆహారాల‌ను ప్రసాదించింది. వాటిలో వెల్లుల్లి కూడా ఒకటి. వెల్లుల్లిలో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో మంచి గుణాలు ఉన్నాయి. ఇప్పుడు వెల్లుల్లి వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.

Garlic is very beneficial for us do not forget to take it
Garlic

వెల్లుల్లి సీజన‌ల‌ ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది. మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచే ఔషధాల్లో వెల్లుల్లి కూడా ఒకటి అని చెప్ప‌వచ్చు. అలాంటి వెల్లుల్లిని మనం సీజనల్ గా కాకుండా ప్రతి రోజు తీసుకుంటే ఎన్నో మంచి ఫలితాలు వస్తాయి. వెల్లుల్లిలో యాంటీ ఇన్ ఫ్లామేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నందున చర్మం మెరిసేందుకు దోహదపడుతుంది. వెల్లుల్లిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు దేహంలోని హానికరమైన బ్యాక్టీరియాను నియంత్రించడంలో సహకరిస్తాయి. చర్మం అందంగా, ఆరోగ్యంగా ఉండి వృద్ధాప్య ఛాయలను ద‌రిచేరనివ్వదు.

రక్తపోటుకు సంబంధించిన సమస్యలు ఉన్నట్లయితే వెల్లుల్లిని తీసుకుంటే అధిక రక్తపోటును కూడా నియత్రిస్తుంది. రక్తనాళాలు రిలాక్స్ అయ్యేందుకు వెల్లుల్లి ఎంతో మేలు చేస్తుంది. మొటిమలు, కురుపులను కూడా నియంత్రిస్తుంది. జుట్టురాలే సమస్యతో బాధపడేవారికి కూడా వెల్లుల్లి ఎంతగానో ఉపయోగపడుతుంది. వెల్లుల్లి మొగ్గలను పేస్ట్ గా చేసి జుట్టు మూలాలపై పెరుగు లేదా తేనెతో కలిపి రాసుకుంటే జుట్టు రాలడం ఆగుతుంది. అందుకే మన పూర్వీకులు వెల్లుల్లి వంటి ఔషధగుణాలు ఉన్న ఆహార పదార్థాలు తినడం వలన ఆరోగ్యంగా జీవించేవారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now