Garikapati : ఇటీవల చిరంజీవి – గరికపాటి ఎపిసోడ్ తో రగిలిన సెగ.. ఇంకా చల్లారనే లేదు. తాజాగా గాడ్ ఫాదర్ సక్సెస్ మీట్‌లోనూ ఆ మంట కనిపించింది. ఈ వేదికపై మాట్లాడిన వక్తలు.. గరికపాటి ఎపిసోడ్ ని గుర్తు చేశారు. ముందుగా దర్శకుడు బాబీ చిరంజీవిగారు ఆ మధ్య నిశ్శబ్ద విస్పోటనం అన్నారు. ఆ మాట విలువ రెండ్రోజుల క్రితమే తెలిసింది. ఎవడు పడితే వాడు.. చిరంజీవిగారికి సరిసాటి రానివాడు కూడా.. తన పని తాను చేసుకొంటూ ఆ క్షణం అలా అవుతున్నా తన పనికి వెళ్తున్నారు చూశారా అదీ చిరంజీవి అంటే అంటూ గరికపాటి ఎపిసోడ్‌ని పరోక్షంగా గుర్తుకు తెచ్చాడు.
ఇక చిరంజీవికి వీరభక్తుడు ఛోటా కె.నాయుడు అయితే.. కాస్త ఘాటుగానే మండిపడ్డాడు. దేశంలో ఎంతమంది స్టార్లున్నా.. మెగాస్టార్ ముందు సరిపోరు. ఈమధ్య ఓ బుల్లి ఇన్సిడెంట్ జరిగింది. ఆడెవడో.. ఫోటోలు తీసుకొంటామండీ ఆయనపై అభిమానంతో తీసుకొంటాం.. మాట్లాడేవాడు మహాపండితుడు, ఆయన అలా మాట్లాడొచ్చా అండీ.. అది తప్పు కదా.. అలాంటి వాడిని కూడా.. చిరంజీవి గారు ఇంటికి ఆహ్వానిస్తానంటే.. ఇది కదా సంస్కారం.. ఇది కదా నేర్చుకోవాల్సింది అనిపించింది.
ఆయన నుంచి ఇదే నేర్చుకొంటాం కూడా అంటూ గరికపాటి, చిరు ఎపిసోడ్ లో చిరు వైపు నిలబడి మాట్లాడారు. గరికపాటి గాడ్ ఫాదర్ సక్సెస్ మీట్ లో తనని ఎక్కువగా టార్గెట్ చేశారనే ఫీలింగ్ లో ఆయన ఉన్నారని.. త్వరలోనే తను కూడా ఓ ప్రెస్ మీట్ కూడా పెట్టనున్నారని తెలిసింది. అయితే ఆ ప్రెస్ మీట్ లో గరికపాటి చిరంజీవికి క్షమాపణలు చెబుతారా.. లేదా చిరంజీవి ఫ్యాన్స్ తనని ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు అని అంటారా అనేది చూడాలి. మొత్తానికి ఈ ఎపిసోడ్ అంత త్వరగా ముగిసేటట్టు లేదనేది నెటిజన్ల వాదన.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…