Garikapati : చిరంజీవిని అంత మాట అన్న తర్వాత.. ఫస్ట్ టైమ్ మీడియా ముందుకు రానున్న గరికపాటి..!

October 11, 2022 8:01 AM

Garikapati : ఇటీవల చిరంజీవి – గ‌రిక‌పాటి ఎపిసోడ్ తో ర‌గిలిన సెగ.. ఇంకా చల్లారనే లేదు. తాజాగా గాడ్ ఫాద‌ర్ స‌క్సెస్ మీట్‌లోనూ ఆ మంట క‌నిపించింది. ఈ వేదిక‌పై మాట్లాడిన వ‌క్తలు.. గ‌రిక‌పాటి ఎపిసోడ్ ని గుర్తు చేశారు. ముందుగా ద‌ర్శ‌కుడు బాబీ చిరంజీవిగారు ఆ మధ్య నిశ్శ‌బ్ద విస్పోట‌నం అన్నారు. ఆ మాట విలువ రెండ్రోజుల క్రిత‌మే తెలిసింది. ఎవడు ప‌డితే వాడు.. చిరంజీవిగారికి స‌రిసాటి రానివాడు కూడా.. త‌న ప‌ని తాను చేసుకొంటూ ఆ క్ష‌ణం అలా అవుతున్నా త‌న ప‌నికి వెళ్తున్నారు చూశారా అదీ చిరంజీవి అంటే అంటూ గ‌రిక‌పాటి ఎపిసోడ్‌ని ప‌రోక్షంగా గుర్తుకు తెచ్చాడు.

ఇక చిరంజీవికి వీరభ‌క్తుడు ఛోటా కె.నాయుడు అయితే.. కాస్త ఘాటుగానే మండిపడ్డాడు. దేశంలో ఎంత‌మంది స్టార్లున్నా.. మెగాస్టార్ ముందు స‌రిపోరు. ఈమ‌ధ్య ఓ బుల్లి ఇన్సిడెంట్ జ‌రిగింది. ఆడెవ‌డో.. ఫోటోలు తీసుకొంటామండీ ఆయ‌నపై అభిమానంతో తీసుకొంటాం.. మాట్లాడేవాడు మ‌హాపండితుడు, ఆయ‌న అలా మాట్లాడొచ్చా అండీ.. అది త‌ప్పు క‌దా.. అలాంటి వాడిని కూడా.. చిరంజీవి గారు ఇంటికి ఆహ్వానిస్తానంటే.. ఇది క‌దా సంస్కారం.. ఇది క‌దా నేర్చుకోవాల్సింది అనిపించింది.

Garikapati reportedly planning a press meet
Garikapati

ఆయ‌న నుంచి ఇదే నేర్చుకొంటాం కూడా అంటూ గ‌రిక‌పాటి, చిరు ఎపిసోడ్ లో చిరు వైపు నిల‌బ‌డి మాట్లాడారు. గరికపాటి గాడ్ ఫాదర్ సక్సెస్ మీట్ లో తనని ఎక్కువగా టార్గెట్ చేశారనే ఫీలింగ్ లో ఆయన ఉన్నారని.. త్వరలోనే తను కూడా ఓ ప్రెస్ మీట్ కూడా పెట్టనున్నారని తెలిసింది. అయితే ఆ ప్రెస్ మీట్ లో గరికపాటి చిరంజీవికి క్షమాపణలు చెబుతారా.. లేదా చిరంజీవి ఫ్యాన్స్ తనని ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు అని అంటారా అనేది చూడాలి. మొత్తానికి ఈ ఎపిసోడ్ అంత త్వరగా ముగిసేటట్టు లేదనేది నెటిజన్ల వాదన.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now