Gangubai Kathiawadi : కొత్త పెళ్లి కూతురు ఆలియా భట్ కొద్ది రోజుల క్రితం గంగూబాయ్ కతియావాడి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో పలకరించిన విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాలలో ఆలియా పర్‌ఫార్మెన్స్‌కి మంత్రముగ్ధులు అయ్యారు. ఇక బాలీవుడ్ చాక్లెట్ బాయ్ రణ్‌బీర్ కపూర్‌తో ఐదేళ్లపాటు డేటింగ్ చేసిన తర్వాత ఏప్రిల్ 14న ముంబైలో వీరు పెళ్లి చేసుకున్నారు. వివాహానికి సన్నిహితులు, కుటుంబ సభ్యులు హాజరయ్యారు. కరణ్ జోహార్, అయాన్ ముఖర్జీ, కరీనా కపూర్, కరిష్మా కపూర్, ఇతరులు.. ఆలియా, రణబీర్ ప్రీ వెడ్డింగ్, వెడ్డింగ్ వేడుకలకు హాజరయ్యారు.
అయితే ఆలియా భట్ నటించిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం గంగూబాయ్ కతియావాడి ఇటీవల విడుదలై పెద్ద విజయం సాధించిన విషయం తెలిసిందే. ముంబైలోని కామటిపుర రాజ్యానికి మాఫియా క్వీన్‌గా ఎదిగిన గంగూబాయి పాత్రలో ఆలియాభట్ నటించింది. ఈ చిత్రంలో ఆలియా నటన అద్భుతం. ప్రేక్షకుల నుంచి విమర్శకుల వరకు ఈమె నటనకు ప్రశంసలు జల్లులు కురిపించారు. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. రూ.100 కోట్ల మార్క్‌ను దాటేసిన ఈ చిత్రం తాజాగా ఓటీటీలో అడుగు పెట్టనుంది.
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించింది. ఏప్రిల్ 26 నుంచి గంగూబాయ్ కతియావాడి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించింది. థియేటర్‌లో సినిమా చూడటం మిస్ అయిన వారు ఓటీటీలో ఈ చిత్రాన్ని చూసి ఎంజాయ్ చేయవచ్చు. కాగా ప్రస్తుతం అలియా డార్లింగ్స్, రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ చిత్రాల్లో నటిస్తోంది. బ్రహ్మాస్త్రా అనే చిత్రంలోనూ రణ్‌బీర్ కపూర్‌తో కూడా నటించింది. ఇందులో నాగార్జున కూడా ముఖ్య పాత్ర పోషించారు. ఈ సినిమా మూడు పార్ట్‌లుగా రూపొందనుంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…