గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Gangubai Kathiawadi : ఓటీటీలో ఆలియా భ‌ట్ గంగూబాయి క‌తియవాడి మూవీ.. ఎందులో అంటే..?

Gangubai Kathiawadi : కొత్త పెళ్లి కూతురు ఆలియా భ‌ట్ కొద్ది రోజుల క్రితం గంగూబాయ్ క‌తియావాడి, ఆర్ఆర్ఆర్ సినిమాల‌తో ప‌ల‌క‌రించిన విష‌యం తెలిసిందే. ఈ రెండు సినిమాల‌లో ఆలియా ప‌ర్‌ఫార్మెన్స్‌కి మంత్ర‌ముగ్ధులు అయ్యారు. ఇక బాలీవుడ్ చాక్లెట్…

Gangubai Kathiawadi : ఓటీటీలో ఆలియా భ‌ట్ గంగూబాయి క‌తియవాడి మూవీ.. ఎందులో అంటే..?

Gangubai Kathiawadi : కొత్త పెళ్లి కూతురు ఆలియా భ‌ట్ కొద్ది రోజుల క్రితం గంగూబాయ్ క‌తియావాడి, ఆర్ఆర్ఆర్ సినిమాల‌తో ప‌ల‌క‌రించిన విష‌యం తెలిసిందే. ఈ రెండు సినిమాల‌లో ఆలియా ప‌ర్‌ఫార్మెన్స్‌కి మంత్ర‌ముగ్ధులు అయ్యారు. ఇక బాలీవుడ్ చాక్లెట్ బాయ్ ర‌ణ్‌బీర్ క‌పూర్‌తో ఐదేళ్లపాటు డేటింగ్ చేసిన తర్వాత ఏప్రిల్ 14న ముంబైలో వీరు పెళ్లి చేసుకున్నారు. వివాహానికి సన్నిహితులు, కుటుంబ సభ్యులు హాజరయ్యారు. కరణ్ జోహార్, అయాన్ ముఖర్జీ, కరీనా కపూర్, కరిష్మా కపూర్, ఇతరులు.. ఆలియా, రణబీర్ ప్రీ వెడ్డింగ్, వెడ్డింగ్ వేడుకలకు హాజరయ్యారు.

Gangubai Kathiawadi to stream on Netflix
Gangubai Kathiawadi

అయితే ఆలియా భ‌ట్ న‌టించిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం గంగూబాయ్ క‌తియావాడి ఇటీవ‌ల విడుద‌లై పెద్ద విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. ముంబైలోని కామ‌టిపుర రాజ్యానికి మాఫియా క్వీన్‌గా ఎదిగిన గంగూబాయి పాత్ర‌లో ఆలియాభ‌ట్‌ న‌టించింది. ఈ చిత్రంలో ఆలియా న‌ట‌న అద్భుతం. ప్రేక్ష‌కుల నుంచి విమర్శ‌కుల వ‌ర‌కు ఈమె న‌ట‌న‌కు ప్ర‌శంస‌లు జ‌ల్లులు కురిపించారు. సంజ‌య్ లీలా భ‌న్సాలీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు సిద్ధ‌మైంది. రూ.100 కోట్ల మార్క్‌ను దాటేసిన ఈ చిత్రం తాజాగా ఓటీటీలో అడుగు పెట్టనుంది.

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంద‌ని సోషల్‌ మీడియాలో అధికారికంగా ప్రకటించింది. ఏప్రిల్‌ 26 నుంచి గంగూబాయ్‌ కతియావాడి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానున్నట్లు వెల్లడించింది. థియేటర్‌లో సినిమా చూడటం మిస్ అయిన వారు ఓటీటీలో ఈ చిత్రాన్ని చూసి ఎంజాయ్ చేయ‌వ‌చ్చు. కాగా ప్రస్తుతం అలియా డార్లింగ్స్,​ రాకీ ఔర్​ రాణీ కీ ప్రేమ్​ కహానీ చిత్రాల్లో నటిస్తోంది. బ్ర‌హ్మాస్త్రా అనే చిత్రంలోనూ ర‌ణ్‌బీర్ క‌పూర్‌తో కూడా న‌టించింది. ఇందులో నాగార్జున కూడా ముఖ్య పాత్ర పోషించారు. ఈ సినిమా మూడు పార్ట్‌లుగా రూపొంద‌నుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి