Alia Bhatt : ఆలియా భ‌ట్ మూవీ.. ఓటీటీలో..?

February 6, 2022 10:08 PM

Alia Bhatt : బాలీవుడ్ న‌టి ఆలియా భ‌ట్ ఈ మ‌ధ్య కాలంలో సౌత్ చిత్రాల‌పై దృష్టి సారించిన విష‌యం విదిత‌మే. అందులో భాగంగానే ఆమె ఆర్ఆర్ఆర్ మూవీలో రామ్ చ‌ర‌ణ్ తేజ్ ప‌క్క‌న సీత‌గా న‌టించింది. అందులో ఆమె పాత్ర నిడివి కేవ‌లం 15 నిమిషాలు మాత్ర‌మే ఉంటుంద‌ని తెలిసింది. అయిన‌ప్ప‌టికీ ఆమె ఏకంగా రూ.5 కోట్ల మేర పారితోషికం తీసుకుంద‌ని స‌మాచారం.

Alia Bhatt movie gangubai kathiawadi may release on OTT
Alia Bhatt

ఇక త్వ‌ర‌లో ఎన్‌టీఆర్‌తో కొరటాల శివ చేయ‌బోయే సినిమాలోనూ ఆలియాను హీరోయిన్‌గా ఎంపిక చేశారు. ఈ విష‌యాన్ని ఆమే స్వ‌యంగా వెల్ల‌డించింది. దీంతో ఈ భామ ద‌క్షిణాదిపై ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టినట్లు స్ప‌ష్ట‌మ‌వుతుంది. అయితే ఆమె హిందీలో న‌టించిన గంగూబాయి క‌తియ‌వాడి సినిమా ఈ నెల‌లోనే విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది.

గంగూబాయి క‌తియ‌వాడి మూవీని ఫిబ్ర‌వ‌రి 25వ తేదీన విడుదల చేయ‌నున్నారు. సంక్రాంతి కానుక‌గా ఈ మూవీని విడుద‌ల చేద్దామ‌నుకున్నారు. కానీ ఆమె న‌టించిన ఆర్ఆర్ఆర్ మూవీ అప్పుడు విడుద‌ల అవుతుంది క‌నుక తాను న‌టించిన ఒక సినిమానే ఇంకో సినిమాకు పోటీ అవుతుంద‌ని భావించిన చిత్ర యూనిట్ గంగూబాయిని ఫిబ్ర‌వ‌రికి వాయిదా వేయించారు.

అయితే ప్ర‌స్తుతం గంగూబాయి సినిమాకు ఓటీటీ సంస్థ‌ల నుంచి మంచి ఆఫ‌ర్లు వ‌స్తున్నాయ‌ట‌. జీ5, అమెజాన్ ప్రైమ్‌, హాట్ స్టార్ వంటి ఓటీటీ సంస్థ‌లు ఈ మూవీకి చ‌క్క‌ని ఆఫ‌ర్‌ల‌ను అందిస్తున్నాయ‌ట‌. దీంతో చిత్ర యూనిట్ ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల నేప‌థ్యంలో మూవీని థియేట‌ర్ల క‌న్నా ఓటీటీలో విడుద‌ల చేస్తేనే బాగుంటుంద‌ని ఆలోచిస్తున్న‌ద‌ట‌. అందువ‌ల్ల ఈ మూవీ నేరుగా ఓటీటీలో విడుద‌ల‌య్యే అవ‌కాశం కూడా ఉంద‌ని అంటున్నారు. ఇక దీనిపై ప్ర‌స్తుతం చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయ‌ని.. త్వ‌ర‌లోనే అధికారిక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేస్తార‌ని తెలుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now