Gangavva : గంగవ్వ.. ఈ పేరుకి పరిచయాలు అక్కర్లేదు. చదువు ఏ మాత్రం రాకపోయినా కూడా తన భాష, యాసతో ఎంతో మంది అభిమానుల మనసులు గెలుచుకుంది గంగవ్వ. మై విలేజ్ షో ద్వారా ఆమెకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఏర్పడ్డారు. ఆమె గొంతులో ఏదో ఆకర్షణ.. ఆమె మాట్లాడుతుంటే మన అవ్వ మాట్లాడిన అనుభూతి. అందుకే ఆమె అతి తక్కువ కాలంలోనే యూట్యూబ్ స్టార్‌గా ఎదిగారు. బోలెడంత పాపులారిటీ సంపాదించుకున్నారు.
లేటు వయసులో ఆమె మంచి పాపులారిటీ దక్కించుకుంది. బిగ్ బాస్ సీజన్ 4లో అడుగుపెట్టిన గంగవ్వ తన జీవితంలో పడ్డ కష్టాలన్నింటినీ చెప్పుకొచ్చింది. అయితే తనకు సొంతిల్లు నిర్మించుకోవాలనే కల ఒకటి ఉండేదని, దాని కోసమే బిగ్ బాస్‌కి వచ్చానని చెప్పింది. ఎట్టకేలకు జగిత్యాల జిల్లా మల్యాల మండలం లంబాడిపల్లిలో నూతనంగా నిర్మించుకున్న ఇంట్లోకి గంగవ్వ గృహప్రవేశం చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
కొత్తింటి కోసం గంగవ్వ బాగానే కష్టపడింది. నాగార్జున ఆమెకు రూ.7 లక్షలు సహాయం చేశారు. బిగ్‌బాస్ షో ద్వారా రూ.11లక్షలు సమకూరడంతోపాటు మరో రూ.3 లక్షల వరకు అప్పు చేసిన గంగవ్వ చివరకు తన సొంత గ్రామం లంబాడిపల్లిలో సొంతిల్లు కట్టించుకుంది. గృహ ప్రవేశ వేడుకకి బిగ్‌బాస్ ఫేమ్ అఖిల్, శివజ్యోతి, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, మై విలేజ్ షో టీం సభ్యులు సహా పలువురు హాజరయ్యారు. ప్రస్తుతం గంగవ్వ గృహప్రవేశ వేడుక వీడియో వైరల్‌గా మారింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…