Gangavva : కొత్తింట్లోకి అడుగుపెట్టిన గంగ‌వ్వ‌.. అఖిల్ రాక‌తో సంతోషంగా ఫీలైన యూట్యూబ్ స్టార్..

November 9, 2021 3:02 PM

Gangavva : గంగ‌వ్వ‌.. ఈ పేరుకి ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. చ‌దువు ఏ మాత్రం రాక‌పోయినా కూడా త‌న భాష‌, యాస‌తో ఎంతో మంది అభిమానుల మ‌న‌సులు గెలుచుకుంది గంగ‌వ్వ‌. మై విలేజ్ షో ద్వారా ఆమెకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఏర్ప‌డ్డారు. ఆమె గొంతులో ఏదో ఆకర్షణ.. ఆమె మాట్లాడుతుంటే మన అవ్వ మాట్లాడిన అనుభూతి. అందుకే ఆమె అతి తక్కువ కాలంలోనే యూట్యూబ్ స్టార్‌గా ఎదిగారు. బోలెడంత పాపులారిటీ సంపాదించుకున్నారు.

Gangavva entered into new house bigg boss fame akhil came

లేటు వయసులో ఆమె మంచి పాపులారిటీ ద‌క్కించుకుంది. బిగ్ బాస్ సీజ‌న్ 4లో అడుగుపెట్టిన గంగవ్వ త‌న జీవితంలో ప‌డ్డ క‌ష్టాల‌న్నింటినీ చెప్పుకొచ్చింది. అయితే త‌న‌కు సొంతిల్లు నిర్మించుకోవాల‌నే క‌ల ఒక‌టి ఉండేద‌ని, దాని కోస‌మే బిగ్ బాస్‌కి వ‌చ్చాన‌ని చెప్పింది. ఎట్ట‌కేల‌కు జగిత్యాల జిల్లా మల్యాల మండలం లంబాడిపల్లిలో నూతనంగా నిర్మించుకున్న ఇంట్లోకి గంగవ్వ గృహప్రవేశం చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

కొత్తింటి కోసం గంగ‌వ్వ బాగానే క‌ష్ట‌ప‌డింది. నాగార్జున ఆమెకు రూ.7 లక్షలు సహాయం చేశారు. బిగ్‌బాస్‌ షో ద్వారా రూ.11లక్షలు సమకూరడంతోపాటు మరో రూ.3 లక్షల వరకు అప్పు చేసిన గంగవ్వ చివరకు తన సొంత గ్రామం లంబాడిపల్లిలో సొంతిల్లు కట్టించుకుంది. గృహ ప్ర‌వేశ వేడుక‌కి బిగ్‌బాస్‌ ఫేమ్‌ అఖిల్‌, శివజ్యోతి, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, మై విలేజ్‌ షో టీం సభ్యులు సహా పలువురు హాజరయ్యారు. ప్ర‌స్తుతం గంగవ్వ గృహ‌ప్ర‌వేశ వేడుక వీడియో వైర‌ల్‌గా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment