Gangavva : గంగ‌వ్వ ఇంట్లో తిరుగుతున్న పెద్ద పులి.. షాకవుతున్న నెటిజ‌న్స్..

December 30, 2021 9:18 AM

Gangavva : మై విలేజ్ షో యూట్యూబ్ చానల్‌ ద్వారా ఫుల్ పాపులర్ అయి ఆ క్రేజ్‌తో తెలుగు బిగ్ బాస్ షోలోకి అడుగుపెట్టి మరింత క్రేజ్ తెచ్చుకుంది గంగ‌వ్వ‌. ప్ర‌స్తుతం గంగ‌వ్వ‌కు ప‌లు సినిమా ఆఫ‌ర్స్ వ‌స్తున్నాయి. ఇటీవ‌ల‌ లవ్ స్టోరీ సినిమాలో కనిపించి మెప్పించిన గంగవ్వకి క్రేజీ ఆఫర్ వచ్చింది. ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించే ఛాన్స్ కొట్టేసింది. మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్‌ని తెలుగులో గాడ్‌ఫాదర్‌గా రీమేక్ చేస్తున్నారు చిరంజీవి. ఇందులో గంగవ్వ చిరంజీవికి తల్లిగా నటిస్తోంది.

tiger is wandering in Gangavva house

మ‌రోవైపు గంగ‌వ్వ సోష‌ల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటోంది. ఆమెకు ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా అకౌంట్స్ ఉన్నాయి. సదరు అకౌంట్స్ లో తన వీడియోలు, ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా గంగవ్వ ఇంటి ఆవరణలో పులి తిరుగుతున్న వీడియోను అప్‌లోడ్‌ చేశారు. ఈ వీడియో చూసి అంద‌రూ షాక‌య్యారు. ఇదెలా జ‌రిగింది అని అనుకున్నారు. కానీ సీజీ ద్వారా ఓ పులి తన ఇంట్లో తిరుగుతున్నట్లు గంగవ్వ అందరికీ భ్రమ కలిగించింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

60 ఏళ్ల గంగ‌వ్వ బిగ్ బాస్ కార్య‌క్ర‌మంలో పాల్గొని అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. పల్లె వాతారణంలో పుట్టిపెరిగిన గంగవ్వకు హౌస్ వాతావరణం సరిపడలేదు. నాలుగు గోడల మధ్య ఏసీ గదుల్లో ఆమె ఉండలేకపోయింది. హోమ్ సిక్ కారణంగా అనారోగ్యం బారినపడింది. అయితే మధ్యలో నిష్క్రమించినా సొంత ఇల్లు కట్టుకోవాలనే ఆమె కలను నెరవేరుస్తానని నాగార్జున హామీ ఇచ్చారు. అన్న‌ట్టుగానే ఇల్లు క‌ట్ట‌డంలో సాయ‌ప‌డ్డాడు నాగ్.

https://www.instagram.com/reel/CX-xKYdPkaJ/?utm_source=ig_embed&ig_rid=d2193f50-8262-4bc9-96aa-04ddb0af7e73

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now