Brahmanandam : న‌య‌న‌తార‌కు పెళ్లి అయితే బ్ర‌హ్మానందంకు వ‌చ్చిన క‌ష్టం ఏమిటి ?

June 10, 2022 6:24 PM

Brahmanandam : లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార‌, ద‌ర్శ‌కుడు విగ్నేష్ శివ‌న్‌ల వివాహం ఘ‌నంగా జ‌రిగిన విష‌యం విదిత‌మే. గురువారం మ‌హాబ‌లిపురంలోని షెరటాన్ గ్రాండ్ లో వీరి వివాహం అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. బంధువులు, కుటుంబ స‌భ్యులు, సెల‌బ్రిటీల న‌డుమ వీరు పెళ్లి చేసుకున్నారు. గ‌త 7 సంవ‌త్స‌రాల నుంచి ప్రేమలో పీక‌ల్లోతు మునిగిపోయి ఉన్న ఈ జంట ఎట్ట‌కేల‌కు వివాహ బంధం ద్వారా ఒక్క‌టైంది. ఈ క్ర‌మంలోనే వారు త‌మ వివాహం సంద‌ర్భంగా త‌మిళ‌నాడు రాష్ట్ర‌మంత‌టా ఒకేసారి 1 ల‌క్ష మంది పేద‌ల‌కు అన్న‌దానం చేసి గొప్ప‌మ‌న‌సు చాటుకున్నారు. ఇక వీరికి సెల‌బ్రిటీలు, అభిమానులు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు.

అయితే న‌య‌న‌తార పెళ్లి ఏమోగానీ.. సోష‌ల్ మీడియాలో మాత్రం జోకులు పేలుతున్నాయి. గ‌తంలో ఈమె న‌టించిన అదుర్స్ సినిమాలోని ప‌లు కామెడీ సీన్ల‌ను ఇప్ప‌టి ఆమె పెళ్లికి జ‌త చేస్తూ కొంద‌రు మీమ్స్ సృష్టిస్తున్నారు. దీంతో అవి వైర‌ల్ అవుతున్నాయి. అదుర్స్ సినిమాలో బ్ర‌హ్మానందం భ‌ట్టు అనే పాత్ర‌లో న‌టించిన విష‌యం విదిత‌మే. అయితే ర‌మాప్ర‌భ‌, న‌య‌న‌తార‌కు ఆయ‌న స‌హాయం చేస్తారు. ఆమెను పెళ్లి చేసుకోవాల‌ని అనుకుంటారు. కానీ క‌థ అడ్డం తిరుగుతుంది. పెళ్లి చూపుల‌క‌ని తోడు వ‌చ్చిన ఎన్‌టీఆర్‌ను చూసి న‌య‌న‌తార మ‌న‌స్సు ప‌డుతుంది. దీంతో భ‌ట్టు ప‌డే ఆవేద‌న అంతా ఇంతా కాదు. అయితే అవే సీన్ల‌ను ఇప్పుడు మ‌ళ్లీ గుర్తు చేస్తున్నారు.

funny posts on Brahmanandam because of Nayanthara wedding
Brahmanandam

న‌య‌న‌తార‌కు వేరే వ్య‌క్తితో పెళ్లి అయింద‌ని.. భ‌ట్టు ఇప్పుడు ఏం చేస్తాడ‌ని.. కొంద‌రు మీమ్స్ సృష్టిస్తున్నారు. ఓడిపోయిన నీ ప్రేమ‌ను గెలిపించుకోవ‌డానికి మ‌ళ్లీ పుడ‌తావురా భ‌ట్టూ.. అని మ‌గ‌ధీర డైలాగ్‌ను మిక్స్ చేసి మ‌రీ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. దీంతో ఆ మీమ్స్‌ను చూసి నెటిజ‌న్లు పెద్ద ఎత్తున న‌వ్వుతున్నారు. వారు ఈ మీమ్స్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. స‌హ‌జంగానే బ్ర‌హ్మానందం ఫొటోలు మీమ్స్‌కు అనువుగా ఉంటాయి. అంద‌రిపై ఆయ‌న సెటైర్లు వేస్తున్న‌ట్లు మీమ్స్ చేస్తారు. కానీ ఇప్పుడు ఆయ‌న‌పైనే సెటైర్లు పేలుతున్నాయి. అయితే ఇవ‌న్నీ స‌రదాకి మాత్ర‌మే. వీటిని ఎవ‌రూ అపార్థం చేసుకోవ‌ద్ద‌ని.. మీమ్స్ సృష్టించిన వారు కోరుతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now