గురువారం, జూన్ 11, 2026
ఆరోగ్యం

Fruits For Liver : మీ లివ‌ర్ ఆరోగ్యంగా ఉండాలా.. లివ‌ర్ క్లీన్ అవ్వాలంటే ఈ పండ్ల‌ను త‌ప్ప‌క తీసుకోండి..!

Fruits For Liver : చాలామంది, ఈ రోజుల్లో రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఎక్కువ మంది. లివర్ సమస్యలతో కూడా బాధపడుతున్నారు. ఆరోగ్యం పట్ల, కచ్చితంగా శ్రద్ధ పెట్టాలి. లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే, ఈ పండ్లను కచ్చితంగా…

Fruits For Liver : మీ లివ‌ర్ ఆరోగ్యంగా ఉండాలా.. లివ‌ర్ క్లీన్ అవ్వాలంటే ఈ పండ్ల‌ను త‌ప్ప‌క తీసుకోండి..!

Fruits For Liver : చాలామంది, ఈ రోజుల్లో రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఎక్కువ మంది. లివర్ సమస్యలతో కూడా బాధపడుతున్నారు. ఆరోగ్యం పట్ల, కచ్చితంగా శ్రద్ధ పెట్టాలి. లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే, ఈ పండ్లను కచ్చితంగా తీసుకోండి. ఈ పండ్లను తీసుకుంటే, లివర్ ఆరోగ్యంగా ఉంటుంది. చాలా రకాల సమస్యలు కూడా దూరం అవుతాయి. కాలేయ ఆరోగ్యానికి ద్రాక్ష పండ్లు బాగా ఉపయోగపడతాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. బ్యాక్టీరియా నుండి, కాలేయాన్ని రక్షించే సామర్థ్యం ద్రాక్షలో ఉంది.

ద్రాక్ష పండ్లు తీసుకుంటే, కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. అలానే, ఆపిల్ కూడా కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచగలదు. ఆపిల్ లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అలానే, కాలేయ కొవ్వుని కూడా ఆపిల్ కరిగించగలదు. అవకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. శరీరానికి కవచంగా అవకాడో పని చేస్తుంది. ఆహారంలో అవకాడో ని చేర్చుకోవడం వలన గుండె ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. బోలి ఎముకల వ్యాధిని కూడా నివారిస్తుంది.

Fruits For Liver take daily for many benefits
Fruits For Liver

అలానే స్ట్రాబెరీస్, రాస్ బెర్రీస్, బ్లాక్ బెర్రీస్ లో కూడా యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ ఉంటాయి. కాలేయ ఆరోగ్యానికి, ఈ బెర్రీస్ కూడా బాగా ఉపయోగపడతాయి. బొప్పాయి కూడా, లివర్ ఆరోగ్యనికి ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనిలో విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. గుండె, జీర్ణక్రియ కి బొప్పాయి బాగా ఉపయోగపడుతుంది. రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. అలానే, బ్లూ బెర్రీస్, కివి ఫ్రూట్స్ లో కూడా పోషకాలు ఎక్కువగా ఉంటాయి.

ఇమ్యూనిటీని కూడా పెంచగలవు. వీటిని తీసుకుంటే కూడా, కాలేయం బాగుంటుంది. అలానే, లివర్ ఆరోగ్యనికి సిట్రస్ ఫ్రూట్స్ కూడా బాగా ఉపయోగపడతాయి. నారింజ, నిమ్మ వంటి సిట్రస్ ఫ్రూట్స్ తీసుకుంటే రోగి నిరోధక శక్తి పెరుగుతుంది పోషకాలు కూడా అందుతాయి. చూశారు కదా ఏ పండ్లు తీసుకుంటే, లివర్ ఆరోగ్యం బాగుంటుందని.. మరి రెగ్యులర్ గా, ఈ పండ్లను తీసుకోండి. లివర్ సమస్యలకు దూరంగా ఉండండి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

వ్యాఖ్యలను మూసివేసారు.