Rosaiah : ఉమ్మ‌డి ఏపీ మాజీ సీఎం కొణిజేటి రోశ‌య్య ఇక‌లేరు

Rosaiah : కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు, ఉమ్మ‌డి ఏపీ మాజీ సీఎం కొణిజేటి రోశ‌య్య క‌న్నుమూశారు. శ‌నివారం ఉద‌యం ఆయ‌న‌కు కార్డియాక్ స్ట్రోక్ రావ‌డంతో వెంట‌నే ప‌ల్స్ లెవ‌ల్స్ ప‌డిపోయాయి. దీంతో ఆయ‌న్ను హాస్పిట‌ల్‌కు త‌ర‌లిస్తుండగా.. మార్గ‌మ‌ధ్య‌లో మృతి చెందారు. ఆయ‌న బీపీ స‌డెన్‌గా ప‌డిపోయింద‌ని కుటుంబ స‌భ్యులు తెలిపారు. రోశ‌య్య వ‌య‌స్సు 88 సంవ‌త్స‌రాలు.

హైద‌రాబాద్‌లోని అమీర్‌పేట‌లో ఆయ‌న నివాసం ఉంటున్నారు. ఆయ‌న‌కు అస్వ‌స్థ‌త క‌ల‌గ‌డంతో కుటుంబ స‌భ్యులు ఆయ‌న్ను బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేటు హాస్పిట‌ల్‌కు చికిత్స నిమిత్తం త‌ర‌లించారు. అయితే అప్ప‌టికే ఆయ‌న మృతి చెందార‌ని వైద్యులు తెలిపారు.

ఈ క్ర‌మంలోనే రోశ‌య్య పార్థివ దేహాన్ని తిరిగి ఇంటికి తీసుకువ‌చ్చారు. ఆయ‌న మ‌ర‌ణ‌వార్త తెలుసుకున్న పార్టీ నాయ‌కులు, బంధువులు, అభిమానులు, శ్రేయోభిలాషులు ఆయ‌న‌కు చివ‌రి వీడ్కోలు ప‌లికేందుకు భారీగా ఆయ‌న ఇంటి వ‌వ‌ద్ద‌కు చేరుకుంటున్నారు.

కాగా రోశ‌య్య జూలై 4, 1933వ సంవ‌త్స‌రంలో గుంటూరు జిల్లా వేమూరు గ్రామంలో జన్మించారు. ఏపీ రాజ‌కీయాల్లో గ‌త 6 ద‌శాబ్దాలుగా ఆయ‌న క్రియాశీల‌కంగా ఉన్నారు. గుంటూరు జిల్లాలోని హిందూ కాలేజీలో రోశ‌య్య కామ‌ర్స్‌లో గ్రాడ్యుయేష‌న్ పూర్తి చేశారు. త‌రువాత రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. 1968, 1974, 1980ల‌లో ఆయ‌న శాస‌న మండ‌లి స‌భ్యుడిగా ఎన్నిక‌య్యారు. మ‌ర్రి చెన్నారెడ్డి ప్ర‌భుత్వ హ‌యాంలో ఆయ‌న రోడ్లు, భ‌వ‌నాల శాఖ‌ మంత్రిగా ప‌నిచేశారు. త‌రువాత ప‌లు భిన్న మంత్రిత్వ శాఖ‌ల్లో బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు.

2004లో ఆయ‌న చీరాల అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎన్నిక‌య్యారు. అప్ప‌టి సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ప్ర‌భుత్వంలో ఆయ‌న ఆర్థిక శాఖ మంత్రిగా ప‌నిచేశారు. అయితే 2009లో ఆయ‌న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌లేదు. మ‌రోమారు శాస‌న‌మండ‌లికి ఎన్నిక‌య్యారు. త‌రువాత సెప్టెంబ‌ర్ 2, 2009న వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి మ‌ర‌ణానంత‌రం రోశ‌య్య ఉమ్మ‌డి ఏపీ సీఎం అయ్యారు. న‌వంబ‌ర్ 4, 2010 వ‌ర‌కు సీఎం ప‌దవిలో ఉన్నారు.

ఆ త‌రువాత రోశ‌య్య ఆగ‌స్టు 31, 2011 నుంచి త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్‌గా ప‌నిచేశారు. క‌ర్ణాట‌క ఇన్‌చార్జి గ‌వ‌ర్న‌ర్‌గా సేవ‌లందించారు. ఆగ‌స్టు 30, 2016 వ‌ర‌కు త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్‌గా రోశయ్య ఉన్నారు. ఆ త‌రువాత ఆయ‌న రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్నారు. అడ‌పా ద‌డ‌పా ప‌లు కార్య‌క్ర‌మాల్లోనూ ఆయ‌న క‌నిపిస్తూ వ‌చ్చారు. ఈ క్ర‌మంలో ఆయ‌న మ‌ర‌ణంతో కాంగ్రెస్ పార్టీలో విషాద ఛాయ‌లు అలుముకున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల‌కు చెందిన సీఎంలు ఇప్ప‌టికే రోశ‌య్య మృతి ప‌ట్ల త‌మ ప్ర‌గాఢ సంతాపం తెలిపారు. తెలంగాణ ప్ర‌భుత్వం డిసెంబ‌ర్ 4, 5, 6 తేదీల‌ను సంతాప దినాలుగా ప్ర‌క‌టించింది. డిసెంబ‌ర్ 5న హైద‌రాబాద్‌లోని కొంప‌ల్లిలో ఉన్న సొంత ఫామ్ హౌస్‌లో మ‌ధ్యాహ్నం 1 గంట‌కు రోశ‌య్య అంత్య‌క్రియ‌ల‌ను ప్ర‌భుత్వ లాంఛ‌నాల‌తో నిర్వ‌హించ‌నున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM