Tollywood : కరోనా మొదటి వేవ్.. ఆ తరువాత రెండో వేవ్.. రెండింటి మూలంగా అనేక రంగాలకు తీవ్రమైన నష్టం వాటిల్లింది. వాటిల్లో సినీ రంగం కూడా ఒకటి. చాలా చిత్రాలు నిర్మాణ దశలో ఆగిపోగా.. కొన్ని నిర్మాణం పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వద్ద నిలిచాయి. కొన్ని విడుదలకు సిద్ధమయ్యాయి. అలాంటి సమయాల్లో కరోనా రెండు దశలు వచ్చి నాశనం చేశాయి. దీంతో సినిమాలను ఏదో ఒక విధంగా పూర్తి చేసి చాలా మంది నిర్మాతలు ఓటీటీలకు ఇచ్చేశారు. నష్టాలను తగ్గించుకున్నారు.
అయితే అంతా బాగానే ఉంది, సద్దుమణుగుతోంది.. అనుకుంటున్న తరుణంలో టాలీవుడ్‌ను మరోసారి కరోనా భయం వెంటాడుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 38 దేశాల్లో కరోనా కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ పంజా విసురుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తాజాగా ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి. దీంతో కోవిడ్ మూడో దశ వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో కరోనా పేరు చెబితేనే టాలీవుడ్ భయపడుతోంది.
ప్రస్తుతానికి ఒమిక్రాన్ వేరియెంట్ ప్రభావం అంతగా లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ 100 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లను రన్ చేస్తున్నారు. అయితే ముందు ముందు కేసులు పెరిగితే ముందుగా స్కూళ్లు, సినిమా థియేటర్లపైనే వేటు పడుతుంది. కనుక రానున్న రోజుల్లో పెరిగే కేసుల సంఖ్యపై టాలీవుడ్ భవితవ్యం ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు. కేసుల సంఖ్య పెరిగితే గనక కచ్చితంగా ఆంక్షలను విధిస్తారు. అప్పుడు ముందుగా మూత పడేది థియేటర్లేనని చెప్పవచ్చు. దీంతో టాలీవుడ్‌కు మరోమారు కరోనా భయం పట్టుకుందని తెలుస్తోంది.
అయితే ఇప్పటికప్పుడు జరిగే నష్టం ఏమీ లేకపోయినా.. కోవిడ్ మూడో వేవ్ వచ్చి థియేటర్లు మూత పడితే పెద్ద సినిమాలకు చాలా నష్టమే జరుగుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే రిలీజ్ డేట్స్‌ను కూడా ప్రకటించేశారు. ఈ తరుణంలో థియేటర్లు మూత పడితే సినిమాలను మళ్లీ వాయిదా వేయాల్సి వస్తుంది. ఆ తరువాత 6 నెలలకు గానీ మూడో వేవ్ తగ్గే అవకాశం ఉండదు. అప్పటికి మరిన్ని సినిమాలకు విడుదలకు సిద్ధమవుతాయి. దీంతో సినిమాల మధ్య గట్టి పోటీ ఉంటుంది. అప్పుడు థియేటర్లు దొరకవు. దీంతో అది కొత్త సమస్యకు దారి తీస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా మూడో వేవ్ రావొద్దనే టాలీవుడ్ కోరుకుంటోంది. మరి ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…