Evaru Meelo Koteeshwarulu : వెండితెరపై సంచలనాలు సృష్టించిన ఎన్టీఆర్ ఇప్పుడు బుల్లితెరపై కూడా సత్తా చాటుతున్నారు. ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమంలో సామాన్యులతోపాటు సెలబ్రిటీలతోనూ సందడి చేస్తున్నారు. మొదటి, రెండు వారాలు ఈ షోకు మంచి రేటింగ్స్ వచ్చినా.. ఆ తర్వాత రాను రాను ఈ షో రేటింగ్ తగ్గుతూ వస్తోంది. ఈ షో కోసం కంటెస్టెంట్ లతో ఎంతో కష్టపడుతున్నా రేటింగ్స్ మాత్రం ఆ రేంజ్‌లో మాత్రం రావడం లేదు.
రేటింగ్ మరింత పెంచేందుకు సెలబ్స్‌ని కూడా తీసుకొస్తున్నారు. తొలి ఎపిసోడ్‌కే రామ్ చరణ్ హోస్ట్‌గా రాగా, ఆ తర్వాత రాజమౌళి, సుకుమార్, సమంత వంటి వారు హాజరయ్యారు. త్వరలో మహేష్ బాబు కూడా హాజరు కానున్నారు. దీపావళి సందర్భంగా ప్రముఖ సంగీత దర్శకులు షోలో ఎన్టీఆర్‌తో సందడి చేశారు. ఈ షోలోకి తమన్, దేవిశ్రీ ప్రసాద్ హాజరు కాగా, ‘మీలో తుంబురుడు, నారదుడు ఎవరు’ అని ఎన్టీఆర్ వారిద్దరినీ ప్రశ్నించారు.
‘ఎవరు మీలో కోటీశ్వరులు’ పాటను తనదైన శైలిలో పాడి దేవిశ్రీ అలరించగా, అందుకు ఎన్టీఆర్ కోరస్ పాడారు. ఇక ‘పంచ్ కోసం పంచ్ ఇచ్చి ప్రాణాలు తీసేస్తా.. కాన్ఫిడెంట్’ అని ఎన్టీఆర్ అంటే, ‘ఓవర్ కాన్ఫిడెంట్’ అంటూ తమన్ చెప్పడంతో నవ్వులు విరిశాయి. దీపావళి కానుకగా ఈ స్పెషల్ ఎపిసోడ్ ప్రసారం కానుంది. ఈ షో చివరి షెడ్యూల్ షూటింగ్ పూర్తైయిందని నవంబర్ 18న పూర్తి కానున్న షోకి మహేష్ బాబు హాజరు కానున్నారని తెలుస్తోంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…