Evaru Meelo Koteeshwarulu : సంగీత ద‌ర్శ‌కుల‌తో తెగ సంద‌డి చేయ‌బోతున్న ఎన్టీఆర్..!

November 1, 2021 9:49 AM

Evaru Meelo Koteeshwarulu : వెండితెర‌పై సంచ‌ల‌నాలు సృష్టించిన ఎన్టీఆర్ ఇప్పుడు బుల్లితెర‌పై కూడా స‌త్తా చాటుతున్నారు. ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు కార్య‌క్ర‌మంలో సామాన్యుల‌తోపాటు సెల‌బ్రిటీల‌తోనూ సంద‌డి చేస్తున్నారు. మొదటి, రెండు వారాలు ఈ షోకు మంచి రేటింగ్స్ వచ్చినా.. ఆ తర్వాత రాను రాను ఈ షో రేటింగ్ తగ్గుతూ వస్తోంది. ఈ షో కోసం కంటెస్టెంట్‌ లతో ఎంతో కష్టపడుతున్నా రేటింగ్స్‌ మాత్రం ఆ రేంజ్‌లో మాత్రం రావడం లేదు.

Evaru Meelo Koteeshwarulu thaman and devi sri prasad to participate in the show with ntr

రేటింగ్ మరింత పెంచేందుకు సెల‌బ్స్‌ని కూడా తీసుకొస్తున్నారు. తొలి ఎపిసోడ్‌కే రామ్ చ‌ర‌ణ్ హోస్ట్‌గా రాగా, ఆ త‌ర్వాత రాజ‌మౌళి, సుకుమార్, స‌మంత వంటి వారు హాజ‌ర‌య్యారు. త్వ‌ర‌లో మ‌హేష్ బాబు కూడా హాజ‌రు కానున్నారు. దీపావ‌ళి సంద‌ర్భంగా ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కులు షోలో ఎన్టీఆర్‌తో సంద‌డి చేశారు. ఈ షోలోకి తమన్, దేవిశ్రీ ప్రసాద్ హాజ‌రు కాగా, ‘మీలో తుంబురుడు, నారదుడు ఎవరు’ అని ఎన్టీఆర్‌ వారిద్దరినీ ప్రశ్నించారు.

‘ఎవరు మీలో కోటీశ్వరులు’ పాటను తనదైన శైలిలో పాడి దేవిశ్రీ అలరించగా, అందుకు ఎన్టీఆర్‌ కోరస్‌ పాడారు. ఇక ‘పంచ్‌ కోసం పంచ్‌ ఇచ్చి ప్రాణాలు తీసేస్తా.. కాన్ఫిడెంట్‌’ అని ఎన్టీఆర్‌ అంటే, ‘ఓవర్‌ కాన్ఫిడెంట్‌’ అంటూ తమన్‌ చెప్పడంతో నవ్వులు విరిశాయి. దీపావళి కానుకగా ఈ స్పెషల్ ఎపిసోడ్‌ ప్రసారం కానుంది. ఈ షో చివరి షెడ్యూల్ షూటింగ్ పూర్తైయిందని నవంబ‌ర్ 18న పూర్తి కానున్న షోకి మహేష్ బాబు హాజరు కానున్నారని తెలుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now