Chapati : ఇటీవల ఎక్కువమందిని వేధిస్తున్న సమస్య అధిక బరువు. బరువు తగ్గాలనుకునే వారు డైట్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. తీసుకునే ప్రతి ఆహారం గురించి క్షుణ్ణంగా తెలుసుకుంటారు. ఇందులో ముఖ్యంగా వారు చేసే మార్పు రాత్రి పూట అన్నానికి బదులు బ్రేక్ ఫాస్ట్ చేయడం. మరీ ముఖ్యంగా చపాతీ తినడం ఇలాంటివి. చపాతీ తింటే బరువు తగ్గటానికి చాలా బాగా సహాయ పడుతుంది. చపాతీలో జింక్, పైబర్ తదితర మినరల్స్ అధికంగా ఉండడంతో మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
చపాతీలను తయారు చేసేందుకు ఉపయోగించే గోధుమల్లో ఐరన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తంలో హిమోగ్లోబిన్ ను ఇంక్రీజ్ చేయటంలో సహాయపడుతుంది. చపాతీలో సహజంగా ఉండే ఫైబర్, సెలీనియం కంటెంట్ కొన్నిరకాల క్యాన్సర్లను నివారిస్తాయి. ఇది క్యాన్సర్ బారిన పడకుండా శరీరాన్ని కాపాడుతుంది. అంతేకాక మరొక ముఖ్య విషయం ఏమిటంటే చపాతీ చక్కగా జీర్ణమై మరుసటి రోజు శరీరం యాక్టివ్ గా ఉండేలా చేస్తుంది.
బరువు పెరుగుతున్నామన్న ఆందోళనలో ఉన్నవారికి, ఒబేసిటీ సమస్యను ఎదుర్కొంటున్న వారికి చపాతీలు తిరుగులేని మంచి ఆహారమని చెప్పవచ్చు. రాత్రిళ్లు రెండు చపాతీలు మాత్రమే తింటే జీర్ణక్రియ బాగుండటమే కాకుండా బరువు తగ్గటానికి సహాయ పడుతుంది. అయితే స్వచ్ఛమైన గోధుమపిండిని వాడితే ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాక చపాతీ చేసుకొనే సమయంలో నూనె వాడకుండా ఉంటే మంచిది. వాటికి తోడు ఆకు కూరలను, పప్పు ఎక్కువగా తీసుకోవాలి. రాత్రి సమయంలో భోజనం మానేసి చపాతీలు తిని చూడండి. ఆ తేడా మీకే తెలుస్తుంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…