Diwali Gifts : సాధారణంగా ఏ వ్యాపార సంస్థ యజమాని అయినా పండుగ సీజన్ వస్తుందంటే కస్టమర్లను ఆకర్షించడానికి కానుకలు, ఉచితాలు వంటి ఆఫర్లు ప్రకటిస్తారు. అమ్మకాలు పెంచుకునేందుకు వినూత్న ప్రచారం చేస్తూ అధిక ఆదాయం పొందాలని చూస్తారు. కానీ తమిళనాడు రాష్ట్రం చెన్నైలోని ఓ నగల షోరూం యజమాని అందరు బిజినెస్‌మెన్‌లా కాకుండా ఉద్యోగస్తుల పక్షపాతిగా మారారు. ఆయన అందించిన బహుమతులు చూసి ఉద్యోగులు ఎంతో సంబరపడిపోయారు.
చెన్నైకి చెందిన జ్యువెలరీ షాప్ యజమాని జయంతి లాల్ చయంతి తన సిబ్బందిని ఈ సంవత్సరం భారీ బహుమతులతో ఆశ్చర్యపరిచారు. దీపావళి కానుకగా రూ. 1.2 కోట్ల విలువైన కార్లు మరియు బైక్‌లను ఇచ్చారు. అతను 10 కార్లు మరియు 20 బైక్‌లను బహుమతిగా ఇచ్చారు. దీనితో సిబ్బంది ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా జయంతి మాట్లాడుతూ.. తన సిబ్బంది మరింత పని చేయడానికి. వారి జీవితంలో ప్రత్యేకత ఉండటానికి ఇది తోడ్పడుతుందని అన్నారు. వారు వ్యాపారంలో హెచ్చు తగ్గుల సమయంలో కూడా తనతో కలిసి పని చేశారని ఆయన తెలిపారు.
లాభాలు సంపాదించడంలో సహాయపడ్డారని పేర్కొన్నారు. వారు కేవలం సిబ్బంది మాత్రమే కాదు. వారు నా కుటుంబం. కాబట్టి వారికి అలాంటి సర్ ప్రైజ్‌లు ఇచ్చి వారిని నా కుటుంబ సభ్యుల్లాగే చూడాలనుకున్నాను. కానుకలు ఇచ్చిన తరువాత నేను మరింత సంతోషంగా ఉన్నాను. ప్రతీ యజమాని వారి సిబ్బందిని, సహోద్యోగులకు బహుమతులు ఇచ్చి గౌరవించాలి అని ఆయన తెలిపారు. కాగా.. ఈ ఏడాది దీపావళి అక్టోబర్ 24 సోమవారం జరుపుకోనున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…