Chapati : చపాతీ తింటే నిజంగా బరువు తగ్గుతారా.. నమ్మలేని నిజాలు..!

October 18, 2022 5:08 PM

Chapati : ఇటీవల ఎక్కువమందిని వేధిస్తున్న సమస్య అధిక బరువు. బరువు తగ్గాలనుకునే వారు డైట్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. తీసుకునే ప్రతి ఆహారం గురించి క్షుణ్ణంగా తెలుసుకుంటారు. ఇందులో ముఖ్యంగా వారు చేసే మార్పు రాత్రి పూట అన్నానికి బదులు బ్రేక్ ఫాస్ట్ చేయడం. మరీ ముఖ్యంగా చపాతీ తినడం ఇలాంటివి. చపాతీ తింటే బరువు తగ్గటానికి చాలా బాగా సహాయ పడుతుంది. చపాతీలో జింక్, పైబర్ తదితర మినరల్స్ అధికంగా ఉండడంతో మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

చపాతీలను తయారు చేసేందుకు ఉపయోగించే గోధుమల్లో ఐరన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తంలో హిమోగ్లోబిన్ ను ఇంక్రీజ్ చేయటంలో సహాయపడుతుంది. చపాతీలో సహజంగా ఉండే ఫైబర్, సెలీనియం కంటెంట్ కొన్నిరకాల క్యాన్సర్లను నివారిస్తాయి. ఇది క్యాన్సర్ బారిన పడకుండా శరీరాన్ని కాపాడుతుంది. అంతేకాక మరొక ముఖ్య విషయం ఏమిటంటే చపాతీ చక్కగా జీర్ణమై మరుసటి రోజు శరీరం యాక్టివ్ గా ఉండేలా చేస్తుంది.

eating Chapati reduces weight is it really true or what
Chapati

బరువు పెరుగుతున్నామన్న ఆందోళనలో ఉన్నవారికి, ఒబేసిటీ సమస్యను ఎదుర్కొంటున్న వారికి చపాతీలు తిరుగులేని మంచి ఆహారమని చెప్పవచ్చు. రాత్రిళ్లు రెండు చపాతీలు మాత్రమే తింటే జీర్ణక్రియ బాగుండటమే కాకుండా బరువు తగ్గటానికి సహాయ పడుతుంది. అయితే స్వచ్ఛమైన గోధుమపిండిని వాడితే ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాక చపాతీ చేసుకొనే సమయంలో నూనె వాడకుండా ఉంటే మంచిది. వాటికి తోడు ఆకు కూరలను, పప్పు ఎక్కువగా తీసుకోవాలి. రాత్రి సమయంలో భోజనం మానేసి చపాతీలు తిని చూడండి. ఆ తేడా మీకే తెలుస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now