Sukumar : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప ది రైజ్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఫుల్ సక్సెస్ అయ్యింది. ఇక ఈ సినిమాకు సీక్వెల్‌గా పుష్ప 2 చిత్రాన్ని తాజాగా పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు చిత్ర యూనిట్. ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వంతోపాటు నిర్మాణంలో కూడా భాగం కానున్నారట. పుష్ప2 మేకింగ్ కోసం మైత్రి మూవీ మేకర్స్ నుండి సుకుమార్ పైసా వసూలు చేయడం లేదట.
పుష్ప విడుదలకు ముందు ఈ దర్శకుడు రూ.15-20 కోట్లు తీసుకోగా, థియేట్రికల్ మార్కెట్‌లో ఈ చిత్రం రూ.150 కోట్లకు అమ్మితే ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ.190+ కోట్ల షేర్ కలెక్షన్ పెరిగింది. డిజిటల్ మరియు శాటిలైట్ హక్కులతో సహా నిర్మాతలు దాదాపు రూ.300 కోట్లు తీసుకున్నారు. అయితే పుష్ప కోసం రూ.50 కోట్లు వసూలు చేసిన అల్లు అర్జున్ రెండవ భాగానికి రూ.110+ కోట్లు తీసుకోనున్నట్టు సమాచారం. అయితే నిర్మాతల నుండి భారీగా డబ్బు డిమాండ్ చేసి ఆర్థిక ఒత్తిడికి గురి చేయడం కంటే.. సుకుమార్ చిత్రానికి సహ నిర్మాతగా మారినట్లు సమాచారం.
సుకుమార్ ఇప్పుడు డబ్బు తీసుకోకుండా సినిమా నికర లాభాల నుంచి వాటా తీసుకుంటారు. అంచనా ప్రకారం ఆ షేర్ సులభంగా రూ.70-90 కోట్ల వరకు రావచ్చు. ఇక ఈ సినిమాపై ఉన్న నమ్మకంతోనే సుకుమార్ ఈ నిర్ణయం తీసుకున్నారని చిత్ర వర్గాలు అంటున్నాయి. పుష్పరాజ్ పాత్రలో మరోసారి బన్నీ విధ్వంసం సృష్టించేందుకు రెడీ అవుతుండగా ఈ చిత్రంలో అందాల భామ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో క్రియేట్ అయ్యాయి. దసరా తర్వాత పుష్ప 2 షూటింగ్ ప్రారంభం కానుంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…