Hello Brother Movie : రూ.2.50 కోట్లు పెట్టి తీసిన హ‌లో బ్ర‌ద‌ర్ మూవీ.. ఎంత వ‌సూలు చేసిందో తెలిస్తే.. దిమ్మ తిరిగిపోతుంది..

September 21, 2022 10:37 PM

Hello Brother Movie : అక్కినేని నాగార్జున యువ సామ్రాట్‌గా సినిమా ఇండ‌స్ట్రీలో ఎంతో పేరుగాంచారు. ఆయ‌న ఎన్నో చిత్రాల్లో న‌టించ‌గా.. అనేక సినిమాలు హిట్ అయ్యాయి. దీంతో ఆయ‌న‌కు ఎంతో పేరు వ‌చ్చింది. అయితే ఆయ‌న చేసిన చిత్రాల్లో ది బెస్ట్ అనిపించుకునే సినిమాలు త‌క్కువే ఉన్నాయి. అలాంటి వాటిల్లో హలో బ్రదర్ కూడా మూవీ కూడా ఒకటి. ఈ సినిమాలో నాగార్జున డబుల్ యాక్షన్ తో ఆకట్టుకున్నారు. 1994 ఏప్రిల్ 20న ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రాన్ని రూ.2.50 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు.

1993లో నాగార్జున హీరోగా వచ్చిన వారసుడు సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమాకు ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించారు. ఈ క్ర‌మంలో నాగార్జున ఈవీవీతో మరో సినిమా చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే ఈసారి ఈవీవీ సత్యనారాయణ ఓ సరికొత్త కథతో ప్రేక్షకుల ముందుకు రావాలని అనుకున్నారు. ఈ క్రమంలో హాలీవుడ్ లో తనకు బాగా నచ్చిన ట్విన్ డ్రాగన్ కథను నాగార్జునకు వినిపించారు. ఈ సినిమా చేద్దామని చెప్పగా నాగార్జున కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ విధంగా హలో బ్రదర్ సినిమాను అనుకున్నారు.

do you know the final collections of Hello Brother Movie
Hello Brother Movie

ఇక ఈ చిత్రానికి ఎల్బీ శ్రీరామ్ డైలాగులు రాశారు. ఈ సినిమాలో రమ్యకృష్ణ, సౌందర్యలను హీరోయిన్లు గా తీసుకున్నారు. షూటింగ్ కూడా చక్కగా పూర్తి చేశారు. ట్విన్స్ అనే కాన్సెప్ట్ తో అప్పటికే ఎన్నో సినిమాలు వచ్చినప్పటికీ ఇద్దరు కవలలు ఒకే రకంగా ప్రవర్తించడం అనే కొత్త కాన్సెప్ట్ తో ఈవీవీ సత్యనారాయణ ఈ సినిమాను తీశారు. దీంతో సినిమా హిట్ అయింది. ప్రేక్ష‌కుల‌కు బాగా న‌చ్చింది. ఈ క్ర‌మంలోనే ఈ చిత్రం రికార్డుల మోత మోగించింది.

ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్ లో ఈ సినిమా 120 షోలు హౌస్ ఫుల్ గా ఆడి రికార్డులు బద్దలు కొట్టింది. 30 రోజుల పాటు రోజుకు నాలుగు ఆటలు హౌస్ ఫుల్ గా రన్ అయ్యింది. అదేవిధంగా 30 కేంద్రాల్లో 50 రోజులు 20 కేంద్రాలలో 100 రోజులు ఆడి రికార్డుల‌ను తిరగరాసింది. ఇక ఈ మూవీ మొత్తంగా రూ.15.25 కోట్ల గ్రాస్‌ను సాధించ‌గా.. రూ.8.50 కోట్ల షేర్‌ను వ‌సూలు చేసి రికార్డుల‌ను తిర‌గ‌రాసింది. ఈ మూవీ నాగార్జున కెరీర్‌లోనే అత్యుత్త‌మ చిత్రంగా నిలుస్తుంద‌ని చెప్ప‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment