Upasana : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, ఉపాసన ఎంత అన్యోన్యంగా ఉంటారో అందరికీ తెలిసిందే. వీరికి పెళ్లయి ఇటీవలే 10 ఏళ్లు పూర్తయ్యాయి. అయితే ఇప్పటి వరకు పిల్లలు లేరనే ఒక దిగులు తప్ప వీరికి ఏ చీకూచింతా లేదు. అంత అన్యోన్యంగా వీరు తమ దాంపత్య జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఇక తమ వివాహ వార్షికోత్సవం సందర్బంగా ఈ జంట ఇటలీకి వెళ్లారు. అక్కడి ఫ్లోరెన్స్ సిటీలో వీరు సందడి చేశారు. అక్కడ తమ పెళ్లి రోజును జరుపుకున్నారు. ఈ క్రమంలోనే వీరు ధరించిన డ్రెస్సులు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
పెళ్లి రోజు సందర్భంగా ఉపాసన ధరించిన గ్రీన్ కలర్ డ్రెస్ ఖరీదు రూ.2,23,409 కాగా.. రామ్ చరణ్ ధరించిన సూట్ ఖరీదు రూ.1,13,000 అని తెలిసింది. ఈ క్రమంలోనే వీరు ఆయా డ్రెస్‌లలో ఎంతో చూడముచ్చటగా ఉన్నారని ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తరువాత రామ్ చరణ్ తొలిసారిగా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్న వేడుక తన పెళ్లి రోజే కావడం విశేషం. ఇక ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీలో చరణ్ నటిస్తుండగా.. దాని నుంచి కాస్త విరామం తీసుకున్నారు.
పెళ్లి రోజు వెకేషన్‌ను ప్రస్తుతం రామ్ చరణ్ ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా ఆయన హార్స్ రైడింగ్ చేస్తూ సందడి చేశారు. ఇక ఇండియాకు రాగానే మళ్లీ యథావిధిగా శంకర్ దర్శకత్వంలో నటిస్తారు. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీని దిల్ రాజు, శిరీష్‌లు అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇందులో చరణ్ ఐఏఎస్ అధికారిగా కనిపించనున్నారని తెలుస్తోంది. అలాగే సునీల్, శ్రీకాంత్ తదితరులు ఇతర కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది.
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…