Ram Charan : రామ్ చ‌ర‌ణ్ ధ‌రించిన ఈ డెనిమ్ జాకెట్ ధ‌ర ఎంతో తెలుసా ?

June 19, 2022 11:00 AM

Ram Charan : మెగా ప‌వ‌ర్ స్టార్‌గా అభిమానుల గుండెల్లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్న రామ్ చ‌ర‌ణ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. చ‌ర‌ణ్ న‌టించిన ఆచార్య సినిమా ఈ మ‌ధ్యే రిలీజ్ కాగా.. బాక్సాఫీస్ వ‌ద్ద ఈ మూవీ నిరాశ ప‌రిచింది. అయితే ఆర్ఆర్ఆర్ మాత్రం భారీ విజ‌యం సాధించింది. దీంతో చ‌ర‌ణ్ ఆచార్య ఫెయిల్యూర్‌ను ప‌క్క‌న‌పెట్టి త‌న త‌దుప‌రి ప్రాజెక్టుపై ఫోక‌స్ పెట్టాడు. అయితే ఇటీవ‌లే రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న దంప‌తులు త‌మ 10వ వివాహ వార్షికోత్స‌వం సంద‌ర్భంగా వెకేష‌న్‌కు వెళ్లారు. ఈ సంద‌ర్భంగా వారి ఫొటోలు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అయ్యాయి.

త‌మ వివాహ వార్షికోత్స‌వం సంద‌ర్భంగా ఉపాస‌న ధ‌రించిన ఓ డ్రెస్ ఖ‌రీదు రూ.2 ల‌క్ష‌ల‌ని తెలియ‌గా.. ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్ ఓ స్టైలిష్ డెనిమ్ జాకెట్‌తో క‌నిపించి అల‌రించాడు. ఆయ‌న ఎయిర్ పోర్టులో ఉన్న‌ప్పుడు ఫొటో తీయ‌గా.. అందులో ఆయ‌న ధ‌రించిన డెనిమ్ జాకెట్ అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. అయితే దాని ధ‌ర కోసం ఆన్‌లైన్‌లో కొంద‌రు వెతికి చూశారు. దాని ధ‌ర తెలిసి షాక‌య్యారు. రామ్ చ‌ర‌ణ్ ధ‌రించిన డెనిమ్ జాకెట్ ఖ‌రీదు అక్ష‌రాలా రూ.2 ల‌క్ష‌లు ఉంటుంద‌ని తెలిసి అవాక్క‌వుతున్నారు. ఈ క్ర‌మంలోనే చ‌ర‌ణ్‌కు చెందిన ఈ ఫొటో వైర‌ల్ అవుతోంది.

do you know the cost of Ram Charan denim jacket
Ram Charan

ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే చ‌ర‌ణ్ త‌న 15వ సినిమాను శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్నాడు. ఇందులో ఆయ‌న‌కు జోడీగా కియారా అద్వానీ న‌టిస్తోంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో సునీల్ కూడా కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ఇక ఈ మూవీకి అధికారి అనే టైటిల్‌ను ప‌రిశీలిస్తుండ‌గా.. దీన్ని దాదాపుగా ఖ‌రారు చేసిన‌ట్లు స‌మాచారం. త్వ‌ర‌లోనే ఈ టైటిల్‌ను అధికారికంగా ప్ర‌క‌టిస్తార‌ని తెలుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment