Pokiri : పోకిరి సినిమాను మిస్‌ చేసుకున్న నటుడు ఎవరో తెలుసా ? ఆ సినిమాను ఆయన చేసి ఉంటే కథ మరోలా ఉండేది..!

June 24, 2022 10:52 AM

Pokiri : సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన ఎన్నో చిత్రాల్లో నటించి అలరించారు. ఈయన తీసిన సినిమాలు చాలా వరకు హిట్‌ అయ్యాయి. ఇక మహేష్‌ బాబు కెరీర్‌లోనే అత్యంత బిగ్గెస్ట్‌ హిట్‌ అయిన సినిమాల్లో పోకిరి ఒకటి. ఈ మూవీ మహేష్‌తోపాటు ఇలియానాకు, పూరీ జగన్నాథ్‌కు ఎంతో లైఫ్‌ను ఇచ్చింది. తెలుగు చిత్ర పరిశ్రమ చరిత్రలోనే పోకిరి ఎన్నో అద్భుతాలు సృష్టించిన మూవీగా నిలిచిపోయింది. ఇప్పటికీ ఈ మూవీని బెంచ్‌ మార్క్‌గా తీసుకుని సినిమాలు చేస్తున్నారంటే అతిశయోక్తి కాదు. అంతలా ఈ మూవీ హిట్‌ అయింది.

పోకిరి సినిమాకు అప్పట్లోనే రూ.12 కోట్ల మేర బడ్జెట్‌ కాగా బాక్సాఫీస్‌ వద్ద ఈ మూవీ ఏకంగా రూ.66 కోట్లను వసూలు చేసింది. ఇక ఈ మూవీని హిందీ, తమిళ భాషల్లోనూ రీమేక్‌ చేయగా.. అక్కడ కూడా హిట్‌ అయింది. అయితే ఇంతటి అద్భుతమైన మూవీని ఒక నటుడు మిస్‌ చేసుకున్నాడని తెలుసా.. అవును.. ఆయన ఇంకెవరో కాదు.. సోనూసూద్‌. మొదట పోకిరి సినిమా కథ సోనూసూద్‌ వద్దకే వచ్చిందట. కానీ ఆయన అప్పటికే టాలీవుడ్‌లో పలు సినిమాలతో బిజీగా ఉన్నారు. అందువల్ల పోకిరి చేయలేకపోయారు. దీంతో కథ మహేష్‌ వద్దకు చేరింది. ఇక ఆ తరువాత ఏం జరిగిందో మనకు తెలుసు.

do you know the actor who missed Pokiri movie
Pokiri

అయితే వాస్తవానికి పోకిరి సినిమాను సోనూసూద్‌ చేసి ఉంటే ఆ కథ మరోలా ఉండేది. ఆయన టాలీవుడ్‌లో ఒక స్టార్‌ హీరో అయి ఉండేవారు. ఇప్పటికే ఆయన హీరోగా ఎన్నో సినిమాలు చేసి ఉండేవారు. కానీ పోకిరి చేయనందున ఇంకా అలాగే విలన్‌ పాత్రల్లో చేస్తున్నారు. అవును మరి.. అందుకే అంటారు.. దేనికైనా అదృష్టం ఉండాలని. అది లేకపోతే ఎవరూ ఏం చేయలేరు. సోనూసూద్‌ విషయంలో ఇది స్పష్టమైంది కూడా.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment