Sid Sriram : తెలుగు సినీ ఇండస్ట్రీ లో పరిచయమే అవసరం లేసి సింగర్ సిద్ శ్రీ రామ్. తన పాటలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాడు. సిద్ శ్రీ రామ్ పాడిన పాటలలో దాదాపుగా అన్ని పాటలూ హిట్ అవ్వడమే కాకుండా యూట్యూబ్ లో ట్రెడింగ్ లో నిలుస్తున్నాయి. సిద్ పాడిన పాటలకు రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తున్నాయని మనకు తెలుసు. సిద్ పాడిన పాటలు సినిమాలకే క్రేజ్ ను తీసుకు వస్తున్నాయని కూడా చెప్పవచ్చు. దీంతో చిన్న నిర్మాత, పెద్ద నిర్మాత అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తమ సినిమాల్లో సిద్ శ్రీ రామ్ పాట ఒకటైనా ఉండేలా చూసుకుంటున్నారు.
హీరోలు సైతం వారి సినిమాల్లో సిద్ పాట ఉండేలా జాగ్రత్త పడుతున్నారని సమాచారం. దీంతో తనకు వచ్చిన ఈ క్రేజ్ ను ఉపయోగించి సిద్ శ్రీ రామ్ తన రెమ్యూనరేషన్ ను రోజురోజుకీ పెంచుకుంటూ వెళ్తున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం ఒక్క పాటకు గాను సిద్ రూ. 6 లక్షల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడని తెలుస్తోంది. ఈ రూ.6 లక్షలకు జీఎస్టీని కూడా నిర్మాతే చెల్లించాల్సి ఉంటుందని సినీ ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. నిర్మాతలు మ్యూజిక్ డైరెక్టర్ కి ఇచ్చిన బడ్జెట్ లోనే సిద్ శ్రీ రామ్ పాట కచ్చితంగా ఉండేలా షరతు విధిస్తున్నారని, దీంతో చిన్న మ్యూజిక్ డైరెక్టర్ లు సినిమా కోసం ఎంత కష్టపడినా వారికి ఎక్కువ మొత్తంలో డబ్బులు మిగలడం లేదని తెలుస్తోంది.
కొందరు హీరోలు కూడా మ్యూజిక్ డైరెక్టర్ కు సిద్ పాట సినిమాలో కచ్చితంగా ఉండాలని షరతు విధిస్తున్నారని ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు. సిద్ పాడిన పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటే ఫర్వాలేదు. కానీ ఈ పాటలు ఆకట్టుకునే రీతిలో ఉండకపోతే అవి వైరల్ గా మారవు. దీంతో సిద్ పాట పాడినా సినిమాకు పెద్దగా ప్రయోజనం ఉండదు. కనుక పాటలు పాడే విషయంలో సిద్‌ను ఎంపిక చేసినా.. వాటి లిరిక్స్.. సంగీతం.. విషయంలో మాత్రం జాగ్రత్త వహించాల్సిందే. అలా చేస్తేనే పాట హిట్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఇక సిద్ తన రెమ్యూనరేషన్ నుపెంచుకుంటూ పోతే అది తన భవిష్యత్తుపై ప్రభావం చూపిస్తుందని.. నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…