Saami Song : అల్లు అర్జున్, సుకుమార్‌ల కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప తొలి పార్ట్ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ మూవీకి ఇప్పటికీ ఇంకా క్రేజ్ తగ్గలేదు. ఇందులోని డైలాగ్‌లను చాలా మంది అనుకరిస్తున్నారు. అలాగే పాటలకు స్టెప్పులు కూడా వేస్తున్నారు. అల్లు అర్జున్ చేసిన శ్రీవల్లి పాట డ్యాన్స్‌ను ఇప్పటికే చాలా మంది చేశారు. అలాగే రష్మిక మందన్న సాంగ్ అయిన సామి సామి పాటకు ఆమె వేసిన విధంగానే హీరోయిన్లు, బుల్లితెర నటీమణులు స్టెప్పులు వేసి అలరించారు. అయితే ఈ పాటకు ఒక వ్యక్తి డ్యాన్స్ చేయడం విశేషం. అది కూడా మహిళలు ధరించే దుస్తులను ధరించి అతను సామి పాటకు డ్యాన్స్ చేశాడు. దీంతో అతని వీడియో వైరల్‌గా మారింది.
అమెరికాలోని న్యూయార్క్‌లో నివాసం ఉండే జైనిల్ మెహతా అనే కొరియోగ్రాఫర్ ఎన్నాళ్ల కిందటో అక్కడ సెటిల్ అయ్యారు. ఆయనది ఇండియాలోని గుజరాత్. అయితే అక్కడ ఆయన కొరియోగ్రఫీ చేస్తుంటారు. ఇక చిన్నప్పటి నుంచి మహిళలు ధరించే దుస్తులు వేసుకుని డ్యాన్స్‌లు చేయడం అంటే ఎంతో ఇష్టం. అందువల్లే ఆయన డ్యాన్స్ నేర్చుకుని కొరియోగ్రాఫర్ అయ్యారు. ఇక తరచూ మహిళల దుస్తులను ధరిస్తూ వారి లాగే ఆయన డ్యాన్స్‌లు చేస్తున్నాడు. అందులో భాగంగానే ఆ వీడియోలను కూడా ఆయన తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేస్తున్నాడు.
ఇక జైనిల్ టాలెంట్‌కు అందరూ ఫిదా అవుతున్నారు. అతను చేసే డ్యాన్స్ అలా ఉంటుంది మరి. తాజాగా ఆయన పుష్పలోని సామి పాటకు డ్యాన్స్ చేసి అలరించారు. ఎంతలా అంటే రష్మిక మందన్న కన్నా కూడా బాగా చేశాడు. శరీరాన్ని స్ప్రింగులా వంచుతూ మహిళలకే సాధ్యం కాని రీతిలో డ్యాన్స్ చేశాడు. అలా అతను పుష్పలోని సామి పాటకు చేసిన డ్యాన్స్ వీడియో ఆకట్టుకుంటోంది. దాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయగా.. ఆ వీడియో వైరల్‌గా మారింది. ఇప్పటికే ఆ వీడియోకు 2.6 లక్షలకు పైగా వ్యూస్, 32వేలకు పైగా లైక్స్ వచ్చాయి. జైనిల్ డ్యాన్స్ ను చూసి అందరూ అతన్ని ప్రశంసిస్తున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…