Sid Sriram : సింగర్ సిద్ శ్రీ‌రామ్‌.. ఒక్క పాట పాడితే తీసుకునే రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా..?

April 13, 2022 2:11 PM

Sid Sriram : తెలుగు సినీ ఇండ‌స్ట్రీ లో ప‌రిచయ‌మే అవ‌స‌రం లేసి సింగ‌ర్ సిద్‌ శ్రీ రామ్‌. త‌న పాట‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్నాడు. సిద్ శ్రీ రామ్ పాడిన పాట‌లలో దాదాపుగా అన్ని పాట‌లూ హిట్ అవ్వ‌డ‌మే కాకుండా యూట్యూబ్ లో ట్రెడింగ్ లో నిలుస్తున్నాయి. సిద్ పాడిన పాట‌ల‌కు రికార్డు స్థాయిలో వ్యూస్ వ‌స్తున్నాయ‌ని మ‌న‌కు తెలుసు. సిద్ పాడిన పాట‌లు సినిమాల‌కే క్రేజ్ ను తీసుకు వ‌స్తున్నాయ‌ని కూడా చెప్ప‌వ‌చ్చు. దీంతో చిన్న నిర్మాత‌, పెద్ద నిర్మాత అనే తేడా లేకుండా ప్ర‌తి ఒక్క‌రూ త‌మ‌ సినిమాల్లో సిద్ శ్రీ రామ్ పాట ఒకటైనా ఉండేలా చూసుకుంటున్నారు.

do you know how much singer Sid Sriram will take to sing song
Sid Sriram

హీరోలు సైతం వారి సినిమాల్లో సిద్ పాట ఉండేలా జాగ్ర‌త్త ప‌డుతున్నార‌ని స‌మాచారం. దీంతో త‌న‌కు వ‌చ్చిన ఈ క్రేజ్ ను ఉప‌యోగించి సిద్ శ్రీ రామ్ త‌న రెమ్యూన‌రేష‌న్ ను రోజురోజుకీ పెంచుకుంటూ వెళ్తున్నాడ‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఒక్క పాట‌కు గాను సిద్ రూ. 6 ల‌క్ష‌ల రెమ్యూన‌రేష‌న్ తీసుకుంటున్నాడ‌ని తెలుస్తోంది. ఈ రూ.6 ల‌క్ష‌ల‌కు జీఎస్టీని కూడా నిర్మాతే చెల్లించాల్సి ఉంటుంద‌ని సినీ ఇండ‌స్ట్రీలో టాక్ న‌డుస్తోంది. నిర్మాత‌లు మ్యూజిక్ డైరెక్ట‌ర్ కి ఇచ్చిన బ‌డ్జెట్ లోనే సిద్ శ్రీ రామ్ పాట క‌చ్చితంగా ఉండేలా ష‌ర‌తు విధిస్తున్నార‌ని, దీంతో చిన్న మ్యూజిక్ డైరెక్ట‌ర్ లు సినిమా కోసం ఎంత క‌ష్ట‌ప‌డినా వారికి ఎక్కువ మొత్తంలో డ‌బ్బులు మిగ‌ల‌డం లేద‌ని తెలుస్తోంది.

కొంద‌రు హీరోలు కూడా మ్యూజిక్ డైరెక్ట‌ర్ కు సిద్ పాట సినిమాలో క‌చ్చితంగా ఉండాల‌ని ష‌ర‌తు విధిస్తున్నార‌ని ఇండ‌స్ట్రీలో చ‌ర్చించుకుంటున్నారు. సిద్ పాడిన పాటలు ప్రేక్ష‌కుల‌ను ఆకట్టుకుంటే ఫ‌ర్వాలేదు. కానీ ఈ పాటలు ఆక‌ట్టుకునే రీతిలో ఉండ‌క‌పోతే అవి వైర‌ల్ గా మార‌వు. దీంతో సిద్ పాట పాడినా సినిమాకు పెద్ద‌గా ప్ర‌యోజ‌నం ఉండ‌దు. క‌నుక పాట‌లు పాడే విష‌యంలో సిద్‌ను ఎంపిక చేసినా.. వాటి లిరిక్స్‌.. సంగీతం.. విష‌యంలో మాత్రం జాగ్ర‌త్త వ‌హించాల్సిందే. అలా చేస్తేనే పాట హిట్ అయ్యేందుకు అవ‌కాశం ఉంటుంది. ఇక‌ సిద్ త‌న రెమ్యూన‌రేష‌న్ నుపెంచుకుంటూ పోతే అది త‌న భ‌విష్య‌త్తుపై ప్ర‌భావం చూపిస్తుంద‌ని.. నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment