Suman : కన్నడ సినిమా పరిశ్రమకి చెందిన వ్యక్తే అయినప్పటికీ.. సుమన్ టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చి తెలుగు తెరపై స్టార్ హీరోగా ఎదిగారు. చూడచక్కని రూపం.. ఆరడుగుల అందగాడు.. అచ్చ తెలుగు అబ్బాయిలా ఉండే సుమన్ కి అప్పట్లో లేడీ ఫాలోయింగ్ ఎక్కువగానే ఉండేది. హీరో, సహాయ నటుడు, విలన్ ఇలా ఏ పాత్ర అయినా సరే అందులో ఒదిగిపోయి నటించే అరుదైన నటులలో సుమన్ ఒకరు. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో దాదాపు 150 చిత్రాల్లో నటించిన సుమన్ తర్వాత కొంతకాలం కొన్ని కారణాల వలన సినిమాలకు దూరం అయ్యారు.
ఆయనకు కెరియర్లో మంచి గుర్తింపు తెచ్చిన పాత్రలు చాలానే ఉన్నాయి. అన్నమయ్య సినిమాలో వెంకటేశ్వర స్వామి, రామదాసు సినిమాలో రాముడి పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు సుమన్. 1980 దశాబ్దంలో సుమన్ టాలీవుడ్ లో చిరంజీవికి పోటీ ఇచ్చారు అంటే ఆయన రేంజ్ ఎంటో అర్థం చేసుకోవచ్చు. యాక్షన్ సినిమాలతో పాటూ కుటుంబ కథా చిత్రాలతో సుమన్ ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరయ్యారు. తరంగిణి సినిమాతో తెలుగులో అడుగుపెట్టి నటనపరంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. హీరోగా మంచి స్థాయిలో ఉన్న టైంలో కొన్ని కారణాల వల్ల ఆయన జైలుకు వెళ్లవలసి వచ్చింది.
సుమన్ జైలు జీవితం గడపడం వెనక ఓ రాజకీయ కుట్ర ఉందని ఆయన ఓ ఇంటర్వ్యూలో ద్వారా తెలిపారు. రెండు సంవత్సరాలు జైలు జీవితం గడిపిన సుమన్ మానసికంగా కుంగిపోయారు. ఆ తర్వాత నిర్దోషిగా బయటకు వచ్చారు. సుమన్ జైలు జీవితం గడిపిన తరవాత కూడా టాలీవుడ్ లెజండరీ రైటర్ బసవరాజు తన మనవరాలు శిరీషను ఇచ్చి వివాహం జరిపించారు. అప్పట్లో ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. సుమన్ నిర్దోషి కాబట్టే బసవరాజు తన మనవరాలు శిరీషతో వివాహం జరిపించారని అంతా అనుకున్నారు.
పెళ్లి తరువాత సుమన్ జీవితం మళ్లీ దారిలోకి వచ్చింది. పెళ్లి తరువాత సుమన్ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి బావబావమరిది, మొండి మొగుడు పెంకి పెళ్ళాం, పెద్దింటి అల్లుడు సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్నారు. ఈ ఇంటర్వ్యూ ద్వారా సుమన్ తన భార్య చాలా మంచిదని, ఆమె వల్లే మరలా తిరిగి సినిమా ఇండస్ట్రీలో పోయిన తన గౌరవాన్ని తిరిగి దక్కించుకున్నానని సుమన్ తెలియజేశారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…