Ramesh Babu : సూప‌ర్ స్టార్ కృష్ణ కుమారుడు ర‌మేష్ బాబు అంత‌టి తీవ్ర‌మైన నిర్ణ‌యాన్ని ఎందుకు తీసుకున్నారు..?

Ramesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబుకి, ఆయన అన్న రమేష్ బాబుకి ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇద్దరూ తెలుగు తెరపైకి ఎంట్రీ ఇచ్చారు మ‌హేష్ బాబు త‌న సినిమా కెరీర్‌ని అన్న‌య్య ర‌మేష్ బాబుని చూసి మొద‌లుపెట్టారు. అల్లూరి సీతారామ రాజు చిత్రం ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్ గా తెలుగు తెరకు పరిచయమయ్యారు రమేష్ బాబు. సామ్రాట్ చిత్రంతో రమేష్ బాబు హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు.  స్వ‌యంగా ర‌మేష్ బాబు కోసం కృష్ణ ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌లు చేప‌ట్టి త‌న కొడుకుని స్టార్ గా చూడాల‌నుకున్నారు. ర‌మేష్ బాబు హీరోగా క‌ళియుగ క‌ర్ణుడు, ముగ్గురు కొడుకులు సినిమాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఆ స‌మ‌యంలోనే ర‌మేష్ బాబుతో కలిసి మ‌హేష్ బాబును న‌టింప‌జేశారు కృష్ణ. కొడుకు కోసం ఎంతో తాపత్రయపడినా కూడా ఆయన రేంజ్ లో స్టార్ స్టేటస్ ని సాధించలేకపోయారు రమేష్ బాబు.

రమేష్ బాబు చదువుకునే సమయంలో కృష్ణ సూపర్ స్టార్ గా దక్షిణ భారతదేశంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. తండ్రి కృష్ణ‌ని చూసి ర‌మేష్ బాబు కూడా ఆయనలా హీరో అవ్వాల‌నుకున్నారు. అల్లూరి సీతారామ రాజు చిత్రం లో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన రమేష్ బాబు మొదటి చిత్రంతోనే ఘన విజయాన్ని అందుకున్నారు. ఆ త‌రువాత ప‌న్నేండ్ల‌కు మ‌నుషులు చేసిన దొంగ‌లు మూవీలో న‌టించారు. ఆ త‌రువాత 14 ఏళ్ల స‌మయంలో దాస‌రి నారాయ‌ణ‌రావు ద‌ర్శ‌క‌త్వంలో నీడ చిత్రంలో కీలక పాత్ర పోషించారు. సినిమాల మీద దృష్టితో రమేష్ బాబు చ‌దువు పాడ‌వుతుంద‌నే ఉద్దేశంతో సినిమాకు దూరంగా పంపించారు కృష్ణ‌. డిగ్రీ ఫైన‌ల్ ఇయ‌ర్ ప‌రీక్ష రాయ‌గానే సామ్రాట్ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ర‌మేష్‌ బాబు.

Ramesh Babu

మా అభిమాన హీరో వారసుడు ఎంట్రీ ఇచ్చాడని ప్రేక్షకులు ఆయన చిత్రాన్ని బాగానే ఆదరించారు. అప్పటికే ఇండస్ట్రీలో నాగార్జున, బాలకృష్ణ, చిరంజీవి చిత్రాలలో సక్సెస్ సాధించి స్టార్ హీరోలుగా పేరు పొంది ముందుకు దూసుకుపోతున్నారు. ఇండస్ట్రీలో ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, కృష్ణ వార‌సుల్లో ఎవ‌రు టాప్ హీరోలుగా రాణిస్తారు అనే విషయంపై ర‌మేష్ బాబు తీవ్ర ఒత్తిడికి లోనయ్యారు. నటన పరంగా రమేష్ బాబు అప్పట్లో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. సామ్రాట్  త‌రువాత చిన్ని కృష్ణుడు, బ‌జార్ రౌడీ ఘన విజయాలు సాధించకపోయినా ఒక మోస్తరు మార్కులతో సరిపెట్టుకున్నాయి. కానీ కృష్ణ మాత్రం ర‌మేష్ బాబుకి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ రావాలని ఆశించారు. ర‌మేష్ బాబుతోపాటు మ‌హేష్ బాబుని కూడా న‌టింప‌జేసి మూవీకి కొత్త క్రేజ్ తీసుకొచ్చే ప్ర‌య‌త్నం చేశారు. ఇక ఆ త‌రువాత వ‌చ్చిన అన్ని సినిమాలు యావ‌రేజ్ టాక్ తెచ్చుకున్నాయి. కృష్ణ‌గారి అబ్బాయి, నా ఇల్లే నా స్వ‌ర్గం, మామా కోడ‌ల్ స‌వాల్‌, ప‌చ్చ‌తోర‌ణం సినిమాలు బాగా ఎదగాలనుకున్న రమేష్ బాబు కెరియర్ గ్రాఫ్ ని తగ్గించేశాయి.

రమేష్  బాబు నటించిన పది చిత్రాల్లో నాలుగు మాత్రమే సక్సెస్ సాధించడంతో మానసిక ఒత్తిడితో ఆయన సినిమాలకు దూరమైపోయారు. సొంత వ్యాపారం పెట్టుకొని తాను సాధించలేని సక్సెస్ ను తన తమ్ముడు సాధించాలని ఆయన సినిమా బాధ్యతలను మహేష్ బాబుకి అప్పగించారు. తమ్ముడు నటించే ప్రతి చిత్రాన్ని తన పర్యవేక్షణలో ఎంతో జాగ్రత్త వహించేవారు రమేష్ బాబు.

తమ్ముడంటే రమేష్ బాబుకు ఎంత ప్రాణమో అన్న అంటే మహేష్ బాబుకు కూడా అంతే ప్రాణం. ఈ ఏడాది జనవరిలో ర‌మేష్‌ బాబు గుండెపోటుతో మరణించారు. త‌న అన్న మ‌ర‌ణించిన‌ప్పుడు క‌రోనా కార‌ణంగా చివ‌రి చూపు చూడ‌లేనందుకు త‌న బాధ‌ను ఒక పోస్ట్ ద్వారా పంచుకున్నాడు. నువ్వు నాకు అడుగులు నేర్పించావు. నా విజ‌యంలో ప్ర‌తీ సంతోషం నీదే. ఎప్ప‌టికి నీవు నా అన్న‌య్య‌వే. జీవితంలో అల‌సిపోయావు. ఇక విశ్రాంతి తీసుకో. నిన్ను ఎప్ప‌టికి మ‌రువ‌నంటూ తన బాధను ఎమోషనల్ గా అన్న గురించి అక్ష‌ర రూపంలో మ‌హేష్ బాబు పంచుకున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM