Rajisha Vijayan : తమిళ సినిమా ఇండస్ట్రీలో సినిమా పెద్దది చిన్నది అనే తేడా లేకుండా విజయం, అపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్న హీరో సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత ఏడాది సూర్య నటించిన ఆకాశమే నీ హద్దురా అనే సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదలై విశేష ప్రేక్షకాదరణ దక్కించుకుని ఏకంగా ఆస్కార్ అవార్డు రేసులో నిలబడింది. ఇదిలా ఉండగా తాజాగా సూర్య జ్ఞానవేల్ దర్శకత్వంలో జై భీమ్ అనే చిత్రాన్ని తెరకెక్కించారు.
కోర్టు బ్యాక్ డ్రాప్ కథతో తెరకెక్కిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదలై మరోసారి మంచి ఆదరణే దక్కించుకుంది. ఇక ఈ సినిమా చూసిన నెటిజన్లు ఇందులో సూర్య సరసన నటించిన హీరోయిన్ రాజిష విజయన్ ఎవరు.. ఆమె సినిమాలలోకి రాకముందు ఎలా ఉండేది.. అనే విషయాల గురించి పెద్ద ఎత్తున సెర్చ్ చేస్తున్నారు. ఇక జై భీమ్ హీరోయిన్ విషయానికి వస్తే..
కేరళలోని కాలికట్ లో జన్మించిన ఈమె డిగ్రీ పూర్తి చేసిన తర్వాత సినిమాల్లోకి రాక ముందు టీవీ యాంకర్ గా పని చేసేది. అనంతరం ఈమె మలయాళం, తమిళలో సుమారుగా పది చిత్రాలకు పైగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలోనే ఈ హీరోయిన్ తెలుగులో రవితేజ సరసన రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. 2016లో అనురాగ కరిక్కిన్ వెల్లం అనే మలయాళ చిత్రం ద్వారా ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగుపెట్టడం, మొదటి సినిమాతోనే అద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో ఈమెకు పలు భాషలలో అవకాశాలు వస్తున్నాయి. ఇక తాజాగా సూర్య నటించిన జై భీమ్ సినిమాలో కీలక పాత్రను పోషించింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…