Congress BJP : హుజురాబాద్‌లో నిజంగానే కాంగ్రెస్‌, బీజేపీ క‌ల‌సి ప‌నిచేశాయా ?

Congress BJP : తెలంగాణ‌లో ప‌ట్టు సాధించాల‌ని బీజేపీ ఎప్ప‌టినుంచో ప్ర‌య‌త్నాలు చేస్తున్న విష‌యం విదిత‌మే. అయితే హుజురాబాద్ లో తెరాస‌పై దాదాపుగా 24వేల ఓట్ల మెజారిటీతో బీజేపీ అభ్య‌ర్థి ఈట‌ల రాజేంద‌ర్ విజ‌యం సాధించ‌డంతో.. బీజేపీకి ఈ విష‌యం క‌ల‌సి వ‌చ్చింద‌నే చెప్ప‌వ‌చ్చు. తెలంగాణ‌లో ప‌ట్టుసాధించాల‌ని అనుకుంటున్న ఆ పార్టీకి ఇది మ‌రింత ఊత‌మిచ్చే విష‌యం. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాల‌ని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది.

అయితే హుజురాబాద్ ఉప ఎన్నిక‌లో కాంగ్రెస్ పార్టీకి చరిత్ర‌లో ఎన్న‌డూ లేని విధంగా ప‌రాభ‌వం ఎదురైంది. ఆ పార్టీ అభ్య‌ర్థి బ‌ల్మూరి వెంక‌ట్ స్థానికేతరుడు అయిన‌ప్ప‌టికీ అక్క‌డ ఆ పార్టీకి మాత్రం ఓటు బ్యాంకు బాగానే ఉంది. అది గ‌త ఎన్నిక‌ల్లో స్ప‌ష్టంగా రుజువైంది. ఆ ఎన్నిక‌ల‌లో 61వేల ఓట్లు రాగా, ఇప్పుడు కేవ‌లం 3వేల ఓట్లు వ‌చ్చాయి. ఈ విష‌యం కాంగ్రెస్‌ను తెగ క‌ల‌వ‌ర‌పెడుతోంది.

రాజ‌కీయాల్లో ఎన్నిసార్లు ఓట‌మి పాలైన‌ప్ప‌టికీ కాంగ్రెస్‌కు ఎప్పుడూ ఇంత‌టి ప‌రాభ‌వం ఎదురుకాలేదు. గౌర‌వ ప్ర‌ద‌మైన స్థాయిలోనే ఓట్ల‌ను సాధించింది. అక్క‌డ 2014 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌కు 38,278 ఓట్లు త‌క్కువ‌లో త‌క్కువ వ‌చ్చాయి. త‌రువాత జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆ పార్టీ త‌ర‌ఫున పోటీ చేసిన కౌశిక్ రెడ్డికి సైతం 61వేల ఓట్లు వ‌చ్చాయి.

కానీ గ‌త ఉప ఎన్నిక‌లో కేవ‌లం 3వేల ఓట్లు మాత్ర‌మే కాంగ్రెస్‌కు వ‌చ్చాయి. ఇది కాంగ్రెస్‌కు ఘోర అవ‌మానంగా రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు. ఓ జాతీయ పార్టీకి ఇంత‌టి త‌క్కువ స్థాయిలో ఓట్లు రావ‌డం అంటే.. అంత‌కు మించిన అవ‌మానం ఇంకొక‌టి ఉండ‌దు.. అని అంటున్నారు.

కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి మొత్తంగా అనుస‌రించిన వ్యూహాలు బెడిసి కొట్టాయ‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. అయితే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కుమ్మ‌క్కు అయ్యాయ‌ని, అందుక‌నే తాము ఓడిపోయాయ‌ని, తెరాస నాయ‌కుడు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హ‌రీష్ రావు ఆరోపించారు. ఈ విష‌యాన్ని ఇత‌ర తెరాస ప్ర‌జా ప్ర‌తినిధులు, నాయ‌కులు కూడా ప‌దే ప‌దే చెబుతున్నారు.

జాతీయ స్థాయిలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు శ‌త్రువులు. కానీ హుజురాబాద్‌లో రెండూ అనైతిక భాగ‌స్వామ్యాన్ని ఏర్పాటు చేశాయ‌ని, అన‌ధికారికంగా క‌ల‌సి పోయాయ‌ని.. అందుక‌నే తెరాస ఓడింద‌ని.. హ‌రీష్ రావు ఆరోపించారు.

ఇక కాంగ్రెస్ ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి కూడా హ‌రీష్ రావు ఆరోప‌ణ‌లు నిజ‌మేనా అనిపించేలా వ్యాఖ్య‌లు చేశారు. కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్‌లో బ‌ల‌మైన అభ్య‌ర్థిని నిల‌ప‌లేద‌ని, దీంతో ఈట‌ల‌కు పోటీ సుల‌భం అయింద‌ని, అందుక‌నే కాంగ్రెస్ ఓడిపోయింద‌ని అన్నారు. శ‌త్రువుకు శ‌త్రువు మిత్రుడ‌న్న‌ట్లు వ్య‌వ‌హ‌రించార‌ని అన్నారు.

అయితే హ‌రీష్ రావు ఆరోప‌ణ‌లు, కోమ‌టిరెడ్డి వ్యాఖ్య‌ల‌ను గ‌మ‌నిస్తే.. ఇందులో కొంతైనా నిజం ఉండ‌క‌పోవ‌చ్చ‌ని.. విశ్లేష‌కులు అంటున్నారు. లేదంటే కాంగ్రెస్‌కు మ‌రీ అంత త‌క్కువ ఓట్లు ఎలా వ‌స్తాయ‌ని అంటున్నారు. 3000 ఓట్లు అంటే హుజురాబాద్‌లో కాంగ్రెస్‌కు అంత‌మంది కార్య‌కర్త‌లు కూడా లేరా ? అన్న అనుమానాలు వ‌స్తున్నాయ‌ని అంటున్నారు.

వాస్త‌వానికి హుజురాబాద్‌లో కాంగ్రెస్ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు, వారి కుటుంబాలు అన్నీ క‌లిస్తే 15వేల ఓట్లు ఉంటాయ‌ని, కానీ వారంద‌రూ ఈట‌ల రాజేంద‌ర్‌కు ఓటు వేసి ఉంటార‌ని, తెరాస వ్య‌తిరేక ఓట్ల‌ను చీల్చ‌డం ఇష్టం లేకే వారంద‌రూ మూకుమ్మ‌డిగా ఈట‌ల‌కు ఓటు వేసి ఉంటార‌ని, లేదంటే తెరాస‌కు ప్ర‌యోజ‌నం క‌లిగేద‌ని.. ఓ కాంగ్రెస్ నేత అన్నారు. దీన్ని బ‌ట్టి చూస్తే తెరాస ఆరోపిస్తున్నట్లు హుజురాబాద్‌లో బీజేపీ, కాంగ్రెస్ క‌ల‌సి ప‌నిచేశాయేమోన‌న్న అనుమానాలు క‌లుగుతున్నాయి. కానీ వారు మాత్రం ఈ విష‌యాన్ని ఖండిస్తున్నారు. ఎవ‌రికి వారు.. ఇంకో పార్టీతో ప‌నిచేసే ప్ర‌స‌క్తే లేద‌ని, అలా జ‌ర‌గ‌ద‌ని అంటున్నారు. మ‌రి హుజురాబాద్ ఉప ఎన్నిక విష‌యంలో జ‌రిగిందేమిటి ? అన్న‌ది మాత్రం ప్ర‌శ్నార్థ‌కంగానే మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM