గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Rajisha Vijayan : సూర్య జై భీమ్ చిత్రంలో నటించిన హీరోయిన్ ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

Rajisha Vijayan : తమిళ సినిమా ఇండస్ట్రీలో సినిమా పెద్దది చిన్నది అనే తేడా లేకుండా విజయం, అపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్న హీరో సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత ఏడాది సూర్య…

Rajisha Vijayan : సూర్య జై భీమ్ చిత్రంలో నటించిన హీరోయిన్ ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

Rajisha Vijayan : తమిళ సినిమా ఇండస్ట్రీలో సినిమా పెద్దది చిన్నది అనే తేడా లేకుండా విజయం, అపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్న హీరో సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత ఏడాది సూర్య నటించిన ఆకాశమే నీ హద్దురా అనే సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదలై విశేష ప్రేక్షకాదరణ దక్కించుకుని ఏకంగా ఆస్కార్ అవార్డు రేసులో నిలబడింది. ఇదిలా ఉండగా తాజాగా సూర్య జ్ఞానవేల్ దర్శకత్వంలో జై భీమ్ అనే చిత్రాన్ని తెరకెక్కించారు.

do you know about Rajisha Vijayan in jai bhim movie

కోర్టు బ్యాక్ డ్రాప్ కథతో తెరకెక్కిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదలై మరోసారి మంచి ఆదరణే దక్కించుకుంది. ఇక ఈ సినిమా చూసిన నెటిజన్లు ఇందులో సూర్య సరసన నటించిన హీరోయిన్ రాజిష విజయన్‌ ఎవరు.. ఆమె సినిమాలలోకి రాకముందు ఎలా ఉండేది.. అనే విషయాల గురించి పెద్ద ఎత్తున సెర్చ్ చేస్తున్నారు. ఇక జై భీమ్ హీరోయిన్ విషయానికి వస్తే..

కేరళలోని కాలికట్ లో జన్మించిన ఈమె డిగ్రీ పూర్తి చేసిన తర్వాత సినిమాల్లోకి రాక ముందు టీవీ యాంకర్ గా పని చేసేది. అనంతరం ఈమె మలయాళం, తమిళలో సుమారుగా పది చిత్రాలకు పైగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలోనే ఈ హీరోయిన్ తెలుగులో రవితేజ సరసన రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. 2016లో అనురాగ కరిక్కిన్ వెల్లం అనే మలయాళ చిత్రం ద్వారా ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగుపెట్టడం, మొదటి సినిమాతోనే అద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో ఈమెకు పలు భాషలలో అవకాశాలు వస్తున్నాయి. ఇక తాజాగా సూర్య నటించిన జై భీమ్ సినిమాలో కీలక పాత్రను పోషించింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి