Prabhas : బాబోయ్ ఈ మిర్చిలాంటి కుర్రాడు అన్ని కోట్ల‌కు అధిప‌తా ?

October 24, 2021 10:56 PM

Prabhas : ప్ర‌భాస్.. ఇప్పుడు ఈ పేరు ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్ష‌కుల‌కి సుప‌రిచితం. బాహుబ‌లి సినిమాతో త‌న రేంజ్‌ని పెంచుకున్న ప్ర‌భాస్ ఇప్పుడు వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాల‌లో ఓ రెండు మంచి హిట్ సాధించాయంటే ప్ర‌భాస్‌ని అందుకోవ‌డం ఎవ‌రి వ‌ల‌నా కాదు.

do you know about Prabhas assets

ప్రభాస్ అసలు పేరు ఉప్పలపాటి వెంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు. ఈ హీరో తొలి హిందీ సినిమా బాహుబలి అని చాలామంది అనుకుంటారు. కానీ బాహుబలి కంటే ముందు బాలీవుడ్ లో యాక్షన్ జాక్సన్ అనే సినిమాలో నటించాడు ప్రభాస్. కాకపోతే అది గెస్ట్ రోల్ మాత్రమే. ఇప్పుడు సౌత్ ఇండియన్ హీరోగా మంచి పేరు పొందాడు. ఇక ఈయన కటౌట్ కి సౌత్ ఇండియా మొత్తం ఫిదా అయిపోయింది.

ప్రభాస్ ఫిజిక్ వెనక ఉన్న వ్యక్తి లక్ష్మణ్ రెడ్డి. ప్రభాస్ ట్రయినర్ ఇతడే. 2010లో లాస్ వెగాస్ లో జరిగిన మిస్టర్ వరల్డ్ పోటీల్లో విజేత ఇతడు. రీసెంట్ గా ఇతడికి ఖరీదైన రేంజ్ రోవర్ కారును బహుమతిగా ఇచ్చాడు ప్రభాస్. అయితే తన గ్రాడ్యుయేషన్ శ్రీ చైతన్య కాలేజ్ ఆఫ్ హైదరాబాద్ లో పూర్తి చేసిన ప్ర‌భాస్ 2002వ సంవత్సరంలో సినీ ఇండస్ట్రీ వైపు అడుగులు వేశాడు. ఈశ్వర్ సినిమాతో యావరేజ్ గా సరిపెట్టుకున్నాడు ప్రభాస్.

ప్ర‌భాస్ కెరియ‌ర్ సాఫీగా సాగుతోంది. ప‌ర్స‌న‌ల్ లైఫ్ మాత్రం కాస్త వెలితిగా క‌నిపిస్తోంది. 42 ఏళ్లు వ‌చ్చినా ఇంకా పెళ్లి చేసుకోక‌పోవ‌డం అభిమానులకి ఆందోళ‌న క‌లిగిస్తోంది. అయితే ఇప్పుడు అధిక మొత్తంలో రెమ్యూనరేషన్ అందుకుంటున్న హీరోగా పేరొందిన ప్ర‌భాస్ 215 కోట్ల రూపాయల ఆస్తిని కూడబెట్టిన‌ట్టు స‌మాచారం. ఇందులో కొంత చారిటీకి ఇస్తుంటాడ‌ట‌. ప్రభాస్‌కి హైదరాబాద్‌లో రూ.62 కోట్ల విలువ చేసే ఒక ఇల్లు ఉన్నట్లుగా సమాచారం. ఇక ఆయ‌న‌ దగ్గర 8 ఖరీదైన కార్లు ఉన్నాయి. వాటి విలువ రూ.20 కోట్లకు పైగా ఉంటుందని అంటున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment