చేప తలను తినకుండా పడేస్తున్నారా.. దాంతో ఎన్ని లాభాలు కలుగుతాయో తెలిస్తే పడేయరు..!

మాంసాహారం తినేవారిలో చాలా మంది చేపలను ఇష్టంగా తింటుంటారు. చేపల్లో అనేక రకాలు ఉంటాయి. ఎవరైనా సరే తమ స్థోమత, అభిరుచులకు అనుగుణంగా చేపలను తెచ్చుకుని తింటుంటారు. చేపలతో చాలా మంది వివిధ రకాల వంటకాలను వండుతుంటారు. చేపల వేపుడు, పులుసు ఇలా చేస్తుంటారు. అయితే చేపలను ఎంతో మంది ఇష్టంగా తిన్నప్పటికీ చేప తలను మాత్రం ఎవరూ తినరు. కొందరు మాత్రమే వీటిని ప్రత్యేకంగా కట్‌ చేయించి మరీ తింటారు. అయితే పోషకాహార నిపుణులు చెబుతున్న ప్రకారం.. చేప తలలు మనకు ఎంతో మేలు చేస్తాయి. వీటిని అసలు పడేయకూడదు. చేప తలలను కూడా ఆహారంలో భాగం చేసుకోవాలని చెబుతున్నారు. చేపల కన్నా చేప తలల్లోనే పోషకాలు అధికంగా ఉంటాయని అంటున్నారు.

చేపల్లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయన్న సంగతి తెలిసిందే. అయితే చేప తలలో ఇంకా ఎక్కువ ప్రోటీన్లు లభిస్తాయి. కనుక చేప తలను తప్పక తినాలి. చికెన్‌, మటన్‌ ల కన్నా ఎక్కువ ప్రోటీన్లు చేప తలలో మనకు లభిస్తాయి. దీంతో శక్తి వస్తుంది. కండరాల నిర్మాణం జరుగుతుంది. కండరాలు ఉత్తేజంగా మారుతాయి. ఎంత సేపు పనిచేసినా అలసిపోరు. నీరసం, ఒత్తిడి, అలసట వంటివి తగ్గుతాయి. రోజంతా నీరసంగా ఉందని, చిన్న పనికే అలసిపోతున్నామని భావించేవారు చేప తలను తినాలి. దీంతో ఆయా సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు. ఉత్సాహంగా ఉంటారు. చురుగ్గా పనిచేస్తారు. ఎంత పనిచేసినా నీరసం, అలసట దరి చేరవు. కాబట్టి చేప తలను ఆహారంలో భాగం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఇక చేప మిగిలిన భాగంలో కన్నా చేప తలలోనే అధికంగా ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి మన గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. రక్తనాళాల్లో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తాయి. దీంతో హార్ట్‌ ఎటాక్‌లు రావు. బీపీ కూడా తగ్గుతుంది. అలాగే మెదడు చురుగ్గా పనిచేస్తుంది. జ్ఙాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. డిప్రెషన్‌ నుంచి బయట పడతారు. నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నవారు చేప తలను తింటే ఫలితం కనిపిస్తుంది. నిద్ర చక్కగా పడుతుంది. పడుకున్న వెంటనే గాఢ నిద్రలోకి జారుకుంటారు. ఒత్తిడి, ఆందోళన వంటివి తగ్గుతాయి. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉన్న ఆహారాలను తింటే కొలెస్ట్రాల్‌ లెవల్స్‌ కూడా తగ్గుతాయి. దీంతోపాటు బరువు తగ్గుతారు. శరీరంలోని కొవ్వు కరుగుతుంది. గుండె అసాధారణ రీతిలో కొట్టుకునే వారు చేప తలను తింటే సమస్య తగ్గుతుంది. ఇందులోని పొటాషియం హార్ట్‌ బీట్‌ను కంట్రోల్‌ చేస్తుంది. కనుక గుండె కొట్టుకునే వేగం తగ్గుతుంది. దీంతో బీపీ కూడా తగ్గుతుంది.

విటమిన్‌ ఎ వల్ల మన శరీర రోగ నిరోధక శక్తి పెరగడంతోపాటు కంటి చూపు కూడా మెరుగు పడుతుంది. వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లు రాకుండా విటమిన్‌ ఎ రక్షిస్తుంది. అయితే చేప తలలో విటమిన్‌ ఎ మనకు పుష్కలంగా లభిస్తుంది. అందువల్ల అనేక లాభాలను పొందవచ్చు. దీన్ని తినడం వల్ల కంటి చూపు స్పష్టంగా ఉంటుంది. భవిష్యత్తులో కంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా కళ్లలో శుక్లాలు రావు. చేప మిగిలిన భాగంతో పోల్చితే చేప తల ఎంతో బలవర్ధకమైన ఆహారం. కనుక దీన్ని తప్పక తీసుకోవాలని.. దీంతో అనేక లాభాలను పొందవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. కాబట్టి చేప తలను తప్పక తినాలి. దీంతో అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండవచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

BSSC ఇంటర్ లెవల్ నోటిఫికేషన్ 2026: అభ్యర్థులకు గుడ్ న్యూస్.. దరఖాస్తు గడువు పొడిగింపు!

బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…

Saturday, 24 January 2026, 10:15 AM

రాయ్‌పూర్ టీ20: కివీస్‌పై భారత్ ఘనవిజయం.. సిరీస్‌లో 2-0 ఆధిక్యం!

రాయ్‌పూర్ వేదికగా జ‌రిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భార‌త్ ఘ‌న విజ‌యం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ ల‌క్ష్యాన్ని…

Friday, 23 January 2026, 10:53 PM

పప్పులను వండే ముందు నానబెడుతున్నారా? లేదంటే డేంజరే.. న్యూట్రిషనిస్ట్ చెబుతున్న షాకింగ్ నిజాలు!

భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…

Friday, 23 January 2026, 8:02 PM

విశ్లేషణ: బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు స్వయంకృతాపరాధం.. పాక్ మాటలు నమ్మి వరల్డ్ కప్‌కు దూరం?

ఎదుటి వ్య‌క్తి క‌ష్టాల్లో ఉంటే అత‌ని ప‌రిస్థితిని కొంద‌రు త‌మ‌కు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆస‌రాగా చేసుకుని త‌మ స్వ‌ప్ర‌యోజ‌నాలు…

Friday, 23 January 2026, 3:54 PM

మీ పాన్ కార్డు పోయిందా? స్మార్ట్‌ఫోన్‌లోనే ‘ఇ-పాన్’ డౌన్‌లోడ్ చేసుకోండి.. పూర్తి ప్రాసెస్ ఇదే!

ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…

Friday, 23 January 2026, 9:51 AM

అల్లు అర్జున్ పోస్ట్‌పై నయనతార ఇంట్రెస్టింగ్ రియాక్షన్.. మెగాస్టార్ సినిమాపై ‘పుష్ప’రాజ్ పోస్ట్ వైరల్!

మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…

Thursday, 22 January 2026, 4:46 PM

కేవలం రూ.9,699కే 32 ఇంచుల స్మార్ట్ టీవీ.. బ్లౌపంక్ట్ నుంచి అదిరిపోయే లాంచ్!

బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…

Thursday, 22 January 2026, 1:51 PM

టీ20 వరల్డ్‌కప్ నుంచి తప్పింపుపై మొహమ్మద్ సిరాజ్ స్పందన

భారత్‌, శ్రీలంకలో ఫిబ్ర‌వ‌రి 7వ తేదీ నుంచి జరగనున్న టీ20 వరల్డ్‌కప్ 2026 జట్టులో తనకు చోటు దక్కకపోవడంపై భారత…

Sunday, 18 January 2026, 11:34 AM