India Post Office Recruitment 2022 : దేశంలో ఉన్న నిరుద్యోగ యువతీ యువకులకు భారతీయ పోస్టల్ విభాగం భారీగా ఉద్యోగ అవకాశాలను అందిస్తోంది. కేంద్ర సమాచార శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న భారతీయ పోస్టల్ విభాగం వారు దేశ వ్యాప్తంగా ఆయా సర్కిల్స్‌లో ఖాళీగా ఉన్న మొత్తం 98వేల ఉద్యోగాలకు నియామక ప్రక్రియను చేపట్టినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే పోస్ట్ మెన్ ఉద్యోగాలు 59099 ఉండగా, 1445 మెయిల్ గార్డ్స్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. వీటికి పదవ తరగతి లేదా ఇంటర్ చదివి ఉంటే చాలని తెలిపారు.
ఈ ఉద్యోగాలకు గాను 10వ తరగతి లేదా ఇంటర్ పూర్తి చేసిన లేదా ఈ సంవత్సరం పూర్తి చేయబోతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే పోస్ట్‌మెన్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసేవారు టెన్త్ లేదా ఇంటర్‌ను ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి చదివి ఉండాలి. అలాగే మెయిల్ గార్డ్ ఉద్యోగాలకు కూడా టెన్త్ లేదా ఇంటర్ చదివి ఉండాలి. వీరు బేసిక్ కంప్యూటర్ స్కిల్స్‌ను కూడా కలిగి ఉండాలి. ఎంటీఎస్ ఉద్యోగాలకు కూడా టెన్త్, ఇంటర్ విద్యార్హలతోపాటు కంప్యూటర్ స్కిల్స్‌ను కూడా కలిగి ఉండాలి.
మొత్తం 98083 ఉద్యోగాల్లో 59099 ఉద్యోగాలు పోస్ట్‌మ్యాన్ విభాగంలో ఉండగా, మెయిల్ గార్డ్ విభాగంలో 1445 ఖాళీలు, మల్టీ టాస్కింగ్ (ఎంటీఎస్) విభాగంలో 37539 ఖాళీలు ఉన్నాయి. వయస్సు 18 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్‌సీ, ఎస్‌టీ, ఓబీసీ, వికలాంగులకు వయస్సులో 3 నుంచి 15 ఏళ్ల వరకు మినహాయింపులు ఉంటాయి. అలాగే జీతం రూ.33718 నుంచి రూ.35370 మధ్య ఉంటుంది. రీజన్ వారిగా చూసుకుంటే ఏపీలో 2289 పోస్ట్ మ్యాన్ ఉద్యోగాలు, 108 మెయిల్ గార్డ్ పోస్టులు, 1166 ఎంటీఎస్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. తెలంగాణలో 1553 పోస్ట్ మ్యాన్ ఉద్యోగాలు, 82 మెయిల్ గార్డ్ ఉద్యోగాలు, 878 ఎంటీఎస్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
జనరల్ కేటగిరికి చెందిన అభ్యర్థులు రూ.100 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. మహిళా అభ్యర్థులు, ఎస్‌సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ట్రాన్స్‌వుమన్ అభ్యర్థులు ఎలాంటి అప్లికేషన్ రుసుమును చెల్లించాల్సిన పనిలేదు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునే వారు www.indiapost.gov.in అనే వెబ్‌సైట్‌ను సందర్శించాలి. హోమ్ పేజీఇలో ఇండియా పోస్ట్ రిక్రూట్‌మెంట్ 2022 అనే ఆన్ లైన్ ఫామ్‌పై క్లిక్ చేయాలి. నోటిఫికేషన్ లింక్ ఓపెన్ చేసి అంతా బాగా చదవాలి. తరువాత అప్లికేషన్ లింక్‌ను క్లిక్ చేస్తే కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో ఫోన్ నంబర్‌ను ఎంటర్ చేసి రిజిస్టర్ చేయాలి. తరువాత సబ్‌మిట్ బటన్‌ను నొక్కాలి. దీంతో అప్లికేషన్ సబ్‌మిట్ అవుతుంది. మరిన్ని వివరాలకు పైన తెలిపిన వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…