Pawan Kalyan : టాలీవుడ్ దర్శకులు ఎందరో ఉన్నారు, కానీ త్రివిక్రమ్ రూటే సపరేటు అని చెప్పవచ్చు. రచయితగా, దర్శకుడిగా త్రివిక్రమ్ మాటలతో ప్రేక్షకులను మాయ చేస్తూ ఉంటాడు. అందుకే త్రివిక్రమ్ మాటల మాంత్రికుడు అయ్యాడు. తన సినిమాలతో అన్ని వర్గాల వారిని అలరిస్తూ టాప్ దర్శకుల లిస్టులో చేరిపోయారు. 2005 సంవత్సరంలో త్రివిక్రమ్, సూపర్ స్టార్ మహేష్ కాంబినేషన్ లో వచ్చిన అతడు చిత్రం ఎంత బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుందో వేరే చెప్పనవసరం లేదు.
ఈ చిత్రానికి గాను జయభేరి ఆర్ట్స్ సంస్థ నిర్మాణ సారథ్యం వహించింది. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన త్రిష హీరోయిన్ గా నటించింది. నాజర్, సునీల్, గిరిబాబు ధర్మవరపు సుబ్రమణ్యం, ప్రకాష్ రాజ్, సోనుసూద్, కోట శ్రీనివాసరావు వంటి వారు ప్రధాన పాత్రలలో నటించారు. మణిశర్మ ఈ చిత్రానికి ఎంతో అద్భుతమైన సంగీతాన్ని అందించారు.
అప్పట్లో మొదటగా ఈ చిత్రానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను హీరోగా అనుకున్నారట దర్శకుడు త్రివిక్రమ్. కథ పరంగా పవన్ కళ్యాణ్ తో చర్చలు జరుపుతుండగా పవన్ నిద్రలోకి చేరుకోవడంతో పవన్ కి కథ నచ్చలేదని దర్శకుడు త్రివిక్రమ్ వెనుతిరిగి వెళ్లిపోయారట. ఆ తర్వాత అతడు చిత్ర కథతో మహేష్ బాబును సంప్రదించగా మహేష్ ఎంతో ఇంట్రెస్టింగ్ కథ అని వెంటనే ఓకే చెప్పేశాడట. ఇలా అతడు చిత్రం కాంబినేషన్ తో వీళ్ళిద్దరూ మంచి సక్సెస్ ను అందుకున్నారు.
ఇప్పుడు అతడు చిత్రంపై తాజాగా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక వార్త హల్ చల్ చేస్తోంది. అతడు చిత్రం సీక్వెల్ రాబోతోంది అంటూ వార్తలు ప్రచారం అవుతున్నాయి. అతడు సీక్వెల్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు కలయికలో సినిమా చేయాలని త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అప్పటికే అతడు సీక్వెల్ పై మహేష్ బాబుతో చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
అంతేకాకుండా ఈ చిత్ర నిర్మాత, జయభేరి ఆర్ట్స్ సంస్థ అధినేత మురళీమోహన్ కూడా అతడు సీక్వెల్ పై ఎంతో ఆసక్తికరంగా వెయిట్ చేస్తున్నారట. ఇదే నిజమైతే అటు పవర్ స్టార్, ఇటు సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు పండగే పండగ అని చెప్పవచ్చు. మరి వీరిద్దరి కలయికలో సినిమా ఎప్పుడు ప్రారంభం కాబోతుంది.. అనేది వేచి చూస్తే తెలుస్తుంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…