Allu Arjun : టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్పతో ఐకాన్ స్టార్‌గా మారాడు. పుష్ప సినిమా విడుదల తర్వాత పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిపోయాడు బన్నీ. తన నటనతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ స్టైలిష్ స్టార్ మరోవైపు వాణిజ్య ప్రకటనలతోనూ కోట్లు గడిస్తున్నాడు. ఇప్పటికే పలు కంపెనీల ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో ఒక్కో యాడ్‌కు రూ.7.50 కోట్ల రెమ్యునేషన్ తీసుకుంటున్నాడని తెలుస్తోంది.
అల్లు అర్జున్ కు ఉన్న క్రేజ్‌ను ఓ గుట్కా అండ్ లిక్కర్ కంపెనీ కూడా వినియోగించుకోవాలనుకుందట. తమ సంస్థ బ్రాండ్ ఉత్పత్తులను ప్రమోట్ చేస్తే ఏకంగా రూ.10 కోట్ల పారితోషకం ఇస్తామని ఆఫర్ చేశారట. అయితే ఐకాన్ స్టార్ మాత్రం ఆ యాడ్ చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పాడట. జనాల ఆరోగ్యానికి హానికరం కలిగించే అలవాట్లను ప్రోత్సహించే ఉద్దేశం లేని బన్నీ ఆ భారీ ఆఫర్‌ను ఏ మాత్రం ఆలోచించకుండా తిరస్కరించినట్లు తెలుస్తోంది.
ఇలాంటి యాడ్స్‌లో నటిస్తే అభిమానులతోపాటు ఆడియన్స్‌లో కూడా నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుందని బన్నీ ముందు జాగ్రత్తగా ఆ సంస్థలకు నో చెప్పినట్లు తెలుస్తోంది. ఐకాన్ స్టార్ నిర్ణయంతో ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం తెలియడంతో తమ హీరోది మంచి మనసంటూ సోషల్ మీడియాలో పోస్టులు షేర్ చేస్తున్నారు.
ఇక సినిమాల విషయానికొస్తే.. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో నటిస్తున్నాడు. ఇటీవలే దేవిశ్రీప్రసాద్ సారథ్యంలో మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా జరిగాయి. పుష్ప ది రూల్ పేరుతో మొదటి భాగం కంటే మరింత గ్రాండ్ గా సుకుమార్ ఈ సీక్వెల్‌ను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. షూటింగ్ కాస్త ఆలస్యమైనా సరే పక్కాగా వెళ్లాలని సుకుమార్ భావిస్తున్నాడట. మొదటి భాగంలో నటించిన వారితోపాటు విజయ్ సేతుపతి కూడా జత కావడంతో.. ఆయన క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుందో అని అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…