30 ఏళ్లు దాటకముందే ఎంతో మంది యువత రక్త పోటు సమస్యతో సతమతమవుతున్నారు. దీన్నే బ్లడ్ ప్రెజర్ (BP) అని అంటారు. ఈ రక్తపోటు సమస్య తక్కువగా ఉన్నా, ఎక్కువగా ఉన్నా కూడా ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. రక్తపోటు ఎక్కువగా ఉన్నప్పుడు గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రక్తపోటు మన నియంత్రణలో ఉండాలంటే ఆరోగ్యకరమైన జీవనశైలి, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ఎంతో అవసరం. రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవడానికి మంచి చిట్కా ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
మన ఇండ్లలో ఉండే మసాలా దినుసులలో గసగసాలు కూడా ఒకటి. ఈ గసగసాలలో మన శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. గసగసాల ద్వారా థయామిన్, కాల్షియం, మాంగనీస్, ప్రొటీన్లు, ఒమెగా -3, ఒమెగా -6 వంటి ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా లభిస్తాయి.
ఒక గ్లాసు పాలలో పావు టీస్పూన్ గసగసాలను వేసి ఉడికించి ఆ పాలను సేవించడం ద్వారా అధిక రక్తపోటు నియంత్రణలోకి వస్తుంది. అంతేకాకుండా బరువు తగ్గాలనే ఆలోచన ఉండేవారికి కూడా ఈ డ్రింక్ ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. గసగసాలలో ఉండే ఫైబర్ శరీరంలోని కొవ్వును కరిగించడానికి సహకరిస్తుంది.
అదేవిధంగా గసగసాలను నోట్లో వేసుకొని నమలడం ద్వారా నోట్లో పుండ్లు, అల్సర్లు వంటివి రాకుండా ఉంటాయి. శరీరంలో అధిక వేడితో బాధపడుతున్నవారు కూడా గసగసాలను నిత్యం ఆహారంలో తీసుకోవడం ద్వారా వేడి సమస్య తగ్గుముఖం పట్టి ఒంటికి చలువ చేస్తుంది. ఇలా గసగసాలతో పలు ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…