Poorna : ఇటీవల కాలంలో సినిమా తారల పెళ్లిళ్లు పెటాకులవడం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే చాలా మంది తారలు తమ వివాహ బంధానికి గుడ్ బై చెప్పి సినిమాలతో బిజీ అయిపోతున్నారు. మరికొందరైతే ఎంగేజ్ మెంట్ చేసుకున్న తర్వాత పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటున్నారు. రష్మిక, మెహరీన్ ఇలా కొంతమంది పెళ్లిపీటలెక్కకుండానే విడిపోయారు. తాజాగా ఈ లిస్ట్ లోకి ఓ అమ్మడు వచ్చి చేరిందని వార్తలు వినిపిస్తున్నాయి.
రఘుబాబు తెరకెక్కించిన అవును సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ పూర్ణ. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినప్పటికీ ఆశించిన స్థాయిలో క్లిక్ అవ్వలేక పోయింది. చాలా రోజుల తర్వాత రీసెంట్ గా బాలయ్య బాబు నటించిన అఖండ సినిమాలో కీలక పాత్రలో నటించి మెప్పించింది పూర్ణ.
అయితే ఈ ఏడాది జూన్ నెలలో తనకు కాబోయే భర్తను ఆమె పరిచయం చేసిన సంగతి తెలిసిందే. షానిద్ అసిఫ్ ఆలీ అనే వ్యక్తితో ఎంగేజ్‌మెంట్ జరిగినట్లు ఆమె సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. కాబోయే భర్తతో కలిసి దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది. అయితే ఆ తరువాత పెళ్లిపై ఎలాంటి అప్‌డేట్ ఇవ్వలేదు. దీంతో పూర్ణకు, షానిద్‌కు మధ్య విభేదాలు వచ్చాయని.. నిశ్చాతార్థం క్యాన్సిల్ అయిందంటూ సోషల్ మీడియాలో వార్తలు స్ప్రెడ్ చేశారు కొంతమంది.
ఈ నేపథ్యంలో పెళ్లి రద్దయిందంటూ వస్తున్న రూమర్స్ కి చెక్ పెట్టింది పూర్ణ. తనకు కాబోయే భర్తతో కలిసి దిగి ఉన్న ఫొటోను షేర్ చేస్తూ.. అతడెప్పటికీ నా వాడే అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దీంతో అందరి నోళ్ళకు తాళం పడినట్టైంది. ఇటు బుల్లితెరపై షోలతో బిజీగా ఉంటోంది పూర్ణ. త్వరలో దసరా, బ్యాక్ డోర్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…