Devi Nagavalli : వామ్మో.. యాంక‌ర్ దేవీ నాగ‌వ‌ల్లిని దారుణంగా బూతులు తిట్టిన విశ్వ‌క్ సేన్‌.. వీడియో..!

Devi Nagavalli : స్లో అండ్ స్ట‌డీగా సినిమాలు చేసుకుంటూ వెళుతుంటున్న యువ హీరో విశ్వ‌క్ సేన్. మ‌నోడు హిట్‌, ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నాడు. తాజాగా ఆయ‌న న‌టించిన సినిమా అశోక వనంలో అర్జున కళ్యాణం. విద్యా సాగర్‌ చింత దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 6న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతుండంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌ స్పీడు పెంచింది. వివిధ ర‌కాలుగా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నారు. రీసెంట్‌గా ఓ ప్రాంక్ వీడియో చేసి హాట్ టాపిక్‌గా మారారు.

మూవీ ప్రమోషన్‌లో భాగంగా ఓ అభిమాని చేత పెట్రోల్‌తో సూసైడ్‌ ప్రయత్నం చేసుకునే విధంగా ప్రాంక్‌ వీడియో చేయించ‌డంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అడ్వకేట్‌ అరుణ్‌ కుమార్‌ హీరో విశ్వక్‌ సేన్‌, మూవీ టీంపై చర్యలు తీసుకోవాలని హెచ్‌ఆర్‌సీకి ఫిర్యాదు చేశారు. సినిమా ప్రమోషన్స్‌ పేరుతో రోడ్లపై న్యూసెన్స్ చేస్తూ పబ్లిక్‌కు అంత‌రాయం కలిగిస్తున్నారని ఆయన ఆరోపించారు. పబ్లిక్‌ ప్లేస్‌లో సినిమా ప్రమోషన్స్‌ చేయకుండా చూసేలా పోలీసులకు ఆదేశాలివ్వాలని ఆయన కోరారు. అడ్వకేట్‌ అరుణ్‌ కుమార్‌ ఫిర్యాదును హెచ్‌ఆర్‌సీ స్వీకరించింది.

Devi Nagavalli

ఈ సంఘటనపై వివరణ కోరేందుకు విశ్వక్ సేన్ ని ఓ మీడియా సంస్థ ఇంటర్వ్యూకి పిలిచింది. విశ్వక్ సేన్ ప్రాంక్ వీడియోపై ఆ న్యూస్ చాన‌ల్ యాంక‌ర్ దేవీ నాగ‌వ‌ల్లి ప్రశ్నలు అడిగింది. సరైన సమాధానం చెప్పకుండా విశ్వక్ వెరైటీ సమాధానాలు చెప్పాడు. దీంతో ఆమెకి చిర్రెత్తుకొచ్చి గెట్ అవుట్ అంటూ విరుచుకుపడింది. దీంతో యు ఫ.. గయ్స్ కాల్డ్ మీ.. అంటూ ఆమెపై విరుచుకు ప‌డ్డాడు విశ్వ‌క్. స‌హ‌నం కోల్పోయిన యాంకర్ యు గెటవుట్ ఫస్ట్ ఫ్రమ్ స్టూడియో.. అంటూ పదే పదే చెప్పడంతో నేను బయటకు పోతే నా గురించి ఇష్టమొచ్చినట్లు చెబుతారు.. యు జస్ట్ షటప్.. అంటూ బ‌య‌ట‌కు వ‌చ్చేశాడు. ఈ క్ర‌మంలో విశ్వ‌క్ సేన్ అలా దేవీ నాగ‌వ‌ల్లిని ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా దారుణంగా తిట్టిన వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్‌గా మారింది. అయితే ప్ర‌స్తుతం ఈ వ్య‌వ‌హారం కోర్టు ప‌రిధిలో ఉన్నందున ఏం తీర్పు వ‌స్తుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM