Deepthi Sunaina : షణ్ముఖ్ జస్వంత్-దీప్తి సునయన ఎప్పటి నుంచో లవ్‌లో ఉన్న విషయం తెలిసిందే. వీళ్లిద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉంటూ.. టాటూలు కూడా వేయించుకున్నారు. షణ్ముఖ్ ఎప్పుడైతే బిగ్ బాస్ హౌజ్‌లోకి వచ్చాడో అప్పటి నుండి అతనిపై అమితమైన ప్రేమను కురిపిస్తూ వార్తలలోకి ఎక్కుతోంది దీప్తి సునయన. కెప్టెన్సీ టాస్క్‌లో తన టవర్ కాపాడుకుంటున్న తరుణంలో సన్నీ-సిరిలకు మధ్య జరిగిన గొడవలో షణ్నూ కలగజేసుకోవడంతో అతనిపై నోరు జారాడు సన్నీ. ఈ క్రమంలో తన సోషల్ మీడియా వేదికగా దీప్తి సునయన సన్నీకి ఇచ్చేసింది.
‘అప్పడం అయిపోతావ్ అనవసరంగానా ? చేతగాని ఆటలు ఆడుతున్నాడు ఏంటి ? ఫిజికల్ అయ్యి గట్టి గట్టిగా అరిస్తే గేమ్ ఆడినట్లా ? ఫిజికల్ అవ్వడం కన్నా కష్టం అయిన టాస్క్ మైండ్‌తో ఆడటం. అది షణ్నూ వంద శాతం ఇస్తున్నాడు. బిగ్‌బాస్ చూశాక తన మీద ప్రేమ మరింత పెరిగింది. ఎంత మెచ్యూర్‌గా బిహేవ్ చేస్తున్నాడు. సపోర్ట్‌గా నిల్చుంటే ఆడవాళ్లని అడ్డు పెట్టుకొని గేమ్ ఆడినట్లా ? మరి నీకు కాజల్, మానస్ సపోర్ట్ చేసినప్పుడు ఏమైంది ? నువ్వు ఎలా ఉండాలో మిగతా వాళ్లుకూడా అలాగే ఉండాలా ఏంది ? నువ్వు బెస్ట్ అనుకో, తప్పులేదు. కానీ మిగతా అందరినీ ఎందుకు అలా చూస్తున్నారు ?
నీలా ఇంకొకరు ఉండలేరు. ఇంకొకరిలా నువ్వు ఉండలేవు. ఈ స్టేజ్ వరకు వచ్చాడు అంటే ఎంత కష్టపడి వచ్చాడు అని హ్యాపీగా ఫీల్ అవ్వకుండా అలాంటి మాటలు అనడం తప్పు సన్నీగారు. మీరు రా అంటేనే పడలేకపోయారు. మరి మీరు అన్ని మాటలు అంటే ఎలా ?’ అంటూ సన్నీని ఏకిపారేసింది. ‘తప్పు అయితే నేర్చుకుంటాం రా బై అని ఎంత బాగా చెప్పావ్ షణ్నూ.. నిన్ను హగ్ చేసుకోవాలనుంది’ అంటూ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది.. దీప్తి సునయన.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…