గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Deepthi Sunaina : ష‌ణ్ముఖ్‌పై నోరు జారినందుకు దీప్తి సున‌యన ఇలా ఇచ్చి ప‌డేసిందేంటి..!

Deepthi Sunaina : ష‌ణ్ముఖ్ జస్వంత్-దీప్తి సునయన ఎప్పటి నుంచో లవ్‌లో ఉన్న విషయం తెలిసిందే. వీళ్లిద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉంటూ.. టాటూలు కూడా వేయించుకున్నారు. ష‌ణ్ముఖ్ ఎప్పుడైతే బిగ్ బాస్ హౌజ్‌లోకి వ‌చ్చాడో అప్ప‌టి నుండి అత‌నిపై…

Deepthi Sunaina : ష‌ణ్ముఖ్‌పై నోరు జారినందుకు దీప్తి సున‌యన ఇలా ఇచ్చి ప‌డేసిందేంటి..!

Deepthi Sunaina : ష‌ణ్ముఖ్ జస్వంత్-దీప్తి సునయన ఎప్పటి నుంచో లవ్‌లో ఉన్న విషయం తెలిసిందే. వీళ్లిద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉంటూ.. టాటూలు కూడా వేయించుకున్నారు. ష‌ణ్ముఖ్ ఎప్పుడైతే బిగ్ బాస్ హౌజ్‌లోకి వ‌చ్చాడో అప్ప‌టి నుండి అత‌నిపై అమిత‌మైన ప్రేమ‌ను కురిపిస్తూ వార్త‌ల‌లోకి ఎక్కుతోంది దీప్తి సున‌య‌న‌. కెప్టెన్సీ టాస్క్‌లో తన టవర్‌ కాపాడుకుంటున్న తరుణంలో సన్నీ-సిరిలకు మధ్య జరిగిన గొడవలో షణ్నూ కలగజేసుకోవడంతో అతనిపై నోరు జారాడు స‌న్నీ. ఈ క్ర‌మంలో త‌న సోష‌ల్ మీడియా వేదిక‌గా దీప్తి సున‌య‌న స‌న్నీకి ఇచ్చేసింది.

Deepthi Sunaina given reply who scolded shanmukh

‘అప్పడం అయిపోతావ్‌ అనవసరంగానా ? చేతగాని ఆటలు ఆడుతున్నాడు ఏంటి ? ఫిజికల్‌ అయ్యి గట్టి గట్టిగా అరిస్తే గేమ్‌ ఆడినట్లా ? ఫిజికల్‌ అవ్వడం కన్నా కష్టం అయిన టాస్క్‌ మైండ్‌తో ఆడటం. అది షణ్నూ వంద శాతం ఇస్తున్నాడు. బిగ్‌బాస్‌ చూశాక తన మీద ప్రేమ మరింత పెరిగింది. ఎంత మెచ్యూర్‌గా బిహేవ్‌ చేస్తున్నాడు. సపోర్ట్‌గా నిల్చుంటే ఆడవాళ్లని అడ్డు పెట్టుకొని గేమ్‌ ఆడినట్లా ? మరి నీకు కాజల్‌, మానస్‌ సపోర్ట్‌ చేసినప్పుడు ఏమైంది ? నువ్వు ఎలా ఉండాలో మిగతా వాళ్లుకూడా అలాగే ఉండాలా ఏంది ? నువ్వు బెస్ట్‌ అనుకో, తప్పులేదు. కానీ మిగతా అందరినీ ఎందుకు అలా చూస్తున్నారు ?

నీలా ఇంకొకరు ఉండలేరు. ఇంకొకరిలా నువ్వు ఉండలేవు. ఈ స్టేజ్‌ వరకు వచ్చాడు అంటే ఎంత కష్టపడి వచ్చాడు అని హ్యాపీగా ఫీల్‌ అవ్వకుండా అలాంటి మాటలు అనడం తప్పు సన్నీగారు. మీరు రా అంటేనే పడలేకపోయారు. మరి మీరు అన్ని మాటలు అంటే ఎలా ?’ అంటూ సన్నీని ఏకిపారేసింది. ‘తప్పు అయితే నేర్చుకుంటాం రా బై అని ఎంత బాగా చెప్పావ్‌ షణ్నూ.. నిన్ను హగ్‌ చేసుకోవాలనుంది’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో రాసుకొచ్చింది.. దీప్తి సున‌య‌న‌.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి