గురువారం, జూన్ 11, 2026
ఆరోగ్యం

Cucumber Juice For Eye Sight : దూరం వ‌స్తువులు క‌నిపించ‌డం లేదా.. ఈ చిట్కాను పాటించి కంటి చూపును పెంచుకోండి..!

Cucumber Juice For Eye Sight : చాలామంది, కంటి సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఉంటారు. కళ్ళు సరిగ్గా కనపడకపోవడం మొదలు, అనేక ఇబ్బందులు వస్తాయి. కంటి చూపుని కోల్పోతే ఎంతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. ట్రీట్మెంట్లు వంటివి…

Cucumber Juice For Eye Sight : దూరం వ‌స్తువులు క‌నిపించ‌డం లేదా.. ఈ చిట్కాను పాటించి కంటి చూపును పెంచుకోండి..!

Cucumber Juice For Eye Sight : చాలామంది, కంటి సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఉంటారు. కళ్ళు సరిగ్గా కనపడకపోవడం మొదలు, అనేక ఇబ్బందులు వస్తాయి. కంటి చూపుని కోల్పోతే ఎంతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. ట్రీట్మెంట్లు వంటివి కూడా చేయించుకోవాల్సిన పరిస్థితి కలుగుతుంది. అటువంటివి ఏమీ కలగకుండా, కంటి చూపుని పెంచుకోవాలంటే, ఇంటి చిట్కాలు కూడా చక్కగా పనిచేస్తాయి. ఈ జ్యూస్ ని తీసుకుంటే, కంటి చూపుని మెరుగుపరచుకోవచ్చు. కంటి చూపు కనుక మందగించిందంటే, లోకమంతా కూడా అంధకారమే.

కనుక, దీనిని రక్షించుకోవడం చాలా అవసరం. 60 ,70 ఏళ్లు దాటిన వాళ్ళలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుత రోజుల్లో పిల్లలు, పెద్దలు అనే తేడా కూడా లేకుండా, చాలామంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. ఆహారపు అలవాట్లు, పోషకాహార లోపం, జీవనశైలిలో ఉండేటువంటి మార్పులు వలన ఈ సమస్య వస్తోంది. ఈ సమస్యను నివారించడానికి కొన్ని ఆహారాలు అద్భుతంగా పనిచేస్తాయి. ఈ జ్యూస్ ని తయారు చేసుకోవడానికి ముందు పైనాపిల్ సగం తీసుకోండి. ఆ పైన ఉండే పొట్టు తీసేసి, లోపల భాగాన్ని ముక్కలు కింద కట్ చేసుకోండి.

Cucumber Juice For Eye Sight drink daily for many benefits
Cucumber Juice For Eye Sight

చిన్న కీరదోస తీసుకుని, దీన్ని కూడా ముక్కలు కింద కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ లో ముక్కలు వేసుకుని, ఆ తర్వాత ఇందులో అరకప్పు కొబ్బరి నీళ్లు కూడా వేసుకుని మిక్సీ పట్టాలి. దీనిని తీసుకుంటే కంటి చూపు మెరుగు పడుతుంది. రెగ్యులర్ గా, ఉదయం పూట కానీ సాయంత్రం కానీ తీసుకుంటే మంచిది. ఈ హెల్తీ జ్యూస్ ని తీసుకున్నట్లయితే, ఆరోగ్యం చాలా బాగుంటుంది.

కంటికి సంబంధించిన ఏమైనా సమస్యలు ఉంటే కూడా దూరం అయిపోతాయి. వారానికి నాలుగు లేదా ఐదు సార్లు దీనిని తీసుకోవచ్చు. ఎముకలు, దంతాలు కూడా దృఢంగా ఉంటాయి. గుండె జబ్బులు కూడా ఉండవు. హృదయ సంబంధిత సమస్యలతో బాధపడే వాళ్ళు, ఈ జ్యూస్ ని తీసుకుంటే గుండె సమస్యలు వుండవు. ఎముకలు, దంతాలు కూడా ఆరోగ్యంగా దృఢంగా మారిపోతాయి. జీర్ణవ్యవస్థ పనితీరు కూడా బాగుంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలు కూడా కంట్రోల్ లో ఉంటాయి. చాలామంది స్క్రీన్ లకి అతుక్కుపోతున్నారు. స్క్రీన్లు కారణంగా కంటి చూపు తగ్గుతోంది. అలాంటి సమస్యలు ఉంటే, దీన్ని తీసుకోండి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

వ్యాఖ్యలను మూసివేసారు.