Annatthe : సూపర్ స్టార్ రజనీకాంత్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమాలకు బాలీవుడ్ హీరోలు సైతం కళ్లు తేలేసేలా బిజినెస్ జరుగుతుంటుంది. ప్రపంచ వ్యాప్తంగా తమిళులు ఉండడంతో పలు దేశాలలో ఆయన నటించే సినిమాలు విడుదలవుతుంటాయి.
రజనీకాంత్ తన కెరీర్ తొలినాళ్లలో ఎక్కువగా తెలుగు సినిమాలలోనే నటించారు. అందుకే ఇప్పటికీ ఆయన సినిమాలు తెలుగులోకి డబ్ అవుతూ ఉంటాయి. మన దగ్గర కూడా ఆయనకు అశేష అభిమానగణం ఉంది. తమిళంలో అయితే రజనీకాంత్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమా రిలీజ్‌ని పండగలా జరుపుకుంటూ ఉంటారు.
దీపావళి సందర్భంగా అన్నాత్తె చిత్రం విడుదల కాగా అభిమానులు థియేటర్స్‌కి పరుగులు తీశారు. తమ కంపెనీ ఉద్యోగులు సినిమా చూడాలని తాపత్రయపడుతుండగా, నవంబర్ 5న తమ ఉద్యోగాలకు ఆఫ్ డే లీవ్ ఇస్తున్నట్లుగా ప్రకటించింది. అంతేకాదు.. దీపావళి కానుకలుగా ఉద్యోగులకు అన్నాత్తే మూవీ ఫ్రీ టికెట్స్ ఇస్తున్నట్లుగా అనౌన్స్ చేసింది. ఈ అనౌన్స్‌మెంట్‌తో ఉద్యోగులు సంతోషపడుతున్నారు.
శివ దర్శకత్వంలో రజనీ హీరోగా ‘అన్నాత్తే’ చిత్రం రూపొందిన సంగతి మనకు తెలిసిందే. ఈ చిత్రం తెలుగు అనువాదం రైట్స్ రూ.12 కోట్లు పలికినట్టు చెబుతున్నారు. ఇందులో మీనా, ఖుష్బూ, నయనతార, కీర్తి సురేశ్ లీడ్ క్యారెక్టర్లు పోషించడంతో ప్రాజక్టుకి మరింత గ్లామర్ పెరిగింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…