Annatthe : ఇంత మంచి కంపెనీలు కూడా ఉంటాయా.. ర‌జ‌నీ సినిమా చూసేందుకు లీవ్ ప్ర‌క‌ట‌న‌..

November 6, 2021 12:00 AM

Annatthe : సూపర్ స్టార్ రజనీకాంత్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆయ‌న సినిమాల‌కు బాలీవుడ్ హీరోలు సైతం కళ్లు తేలేసేలా బిజినెస్ జరుగుతుంటుంది. ప్రపంచ వ్యాప్తంగా తమిళులు ఉండడంతో పలు దేశాలలో ఆయన నటించే సినిమాలు విడుదలవుతుంటాయి.

company given leave to employees to watch Annatthe  movie

ర‌జ‌నీకాంత్‌ తన కెరీర్ తొలినాళ్లలో ఎక్కువగా తెలుగు సినిమాలలోనే నటించారు. అందుకే ఇప్పటికీ ఆయన సినిమాలు తెలుగులోకి డబ్ అవుతూ ఉంటాయి. మ‌న ద‌గ్గ‌ర కూడా ఆయ‌నకు అశేష అభిమానగ‌ణం ఉంది. త‌మిళంలో అయితే ర‌జ‌నీకాంత్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్‌లో ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆయ‌న సినిమా రిలీజ్‌ని పండ‌గ‌లా జ‌రుపుకుంటూ ఉంటారు.

దీపావ‌ళి సంద‌ర్భంగా అన్నాత్తె చిత్రం విడుద‌ల కాగా అభిమానులు థియేట‌ర్స్‌కి ప‌రుగులు తీశారు. త‌మ కంపెనీ ఉద్యోగులు సినిమా చూడాల‌ని తాప‌త్ర‌య‌ప‌డుతుండ‌గా, నవంబర్ 5న తమ ఉద్యోగాలకు ఆఫ్ డే లీవ్ ఇస్తున్నట్లుగా ప్రకటించింది. అంతేకాదు.. దీపావళి కానుకలుగా ఉద్యోగులకు అన్నాత్తే మూవీ ఫ్రీ టికెట్స్ ఇస్తున్నట్లుగా అనౌన్స్ చేసింది. ఈ అనౌన్స్‌మెంట్‌తో ఉద్యోగులు సంతోష‌ప‌డుతున్నారు.

శివ దర్శకత్వంలో రజనీ హీరోగా ‘అన్నాత్తే’ చిత్రం రూపొందిన సంగతి మనకు తెలిసిందే. ఈ చిత్రం తెలుగు అనువాదం రైట్స్ రూ.12 కోట్లు పలికినట్టు చెబుతున్నారు. ఇందులో మీనా, ఖుష్బూ, నయనతార, కీర్తి సురేశ్ లీడ్ క్యారెక్టర్లు పోషించడంతో ప్రాజక్టుకి మరింత గ్లామర్ పెరిగింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now