Chiranjeevi : ఒకప్పుడు ఎన్‌టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణలు.. టాలీవుడ్ సింహసనాన్ని ఏలారు. ఒకరి మీద ఒకరు పోటీ పడి మరీ సినిమాలు తీస్తూ నంబర్ వన్‌గా నిలిచారు. ఆ తరువాత ఆ స్థాయిలో గుర్తింపు పొందింది మెగాస్టార్ చిరంజీవి మాత్రమే అని చెప్పవచ్చు. అయితే చిరంజీవి తరం కూడా ఎప్పుడో ఒకప్పుడు ముగియక తప్పదు. ఇప్పటికే ఆయన కుమారుడు రామ్ చరణ్ తేజ సినిమాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
అయితే చిరంజీవి తరువాత టాలీవుడ్‌లో ఆ స్థాయి ఆదరణ ఎవరికి ఉంది ? ఎవరు నంబర్ వన్ కాగలరు ? అన్న విషయానికి వస్తే.. ఒకప్పుడు.. అంటే.. మహేష్ బాబు పోకిరి విడుదలైనప్పటి ముచ్చట ఒకటి చెప్పాలి. అప్పట్లో మహేష్ వరుస హిట్‌లో జోరు మీద ఉన్నారు. అయితే విలేకరులు కాంట్రవర్సీ చేయాలని చెప్పి టాలీవుడ్‌లో చిరంజీవి తరువాత నంబర్ వన్ ఎవరు ? అని అడిగారట. ఈ క్రమంలో మహేష్ ఇందుకు చాలా తెలివిగా సమాధానం చెప్పారట.
చిరంజీవి ఒక లెజెండ్. ఆయనతో పోటీ పడలేం. కానీ ఆయన తరువాత నంబర్ వన్ ఎవరు ? అంటే.. ఎవరైనా కావచ్చు. ఒక శుక్రవారం ఒకరు, ఇంకో శుక్రవారం ఇంకొకరు. ఇలా నంబర్ వన్ మారుతుంటారు. అని మహేష్ తెలివిగా సమాధానం చెప్పారట. ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే అప్పట్లో మహేష్ చెప్పింది నిజమేనని అనిపిస్తుంది.
అయితే అప్పట్లో ఒక యువ హీరో వరుస హిట్స్ రాగానే తానే టాలీవుడ్ లో చిరంజీవి తరువాత నంబర్ వన్ అని చెప్పాడట. కానీ ఫ్లాప్స్ పడే సరికి బొక్క బోర్లాపడ్డాడని టాక్ వినిపించింది. ఇది ఎంత వరకు నిజమో తెలియదు కానీ అప్పట్లో ఇదే విషయంపై జోరుగా చర్చ సాగింది. అయితే ఇప్పటి హీరోలు మాత్రం తామే నంబర్ వన్ అని అనుకోవడం లేదు. హిట్ కొట్టామా, కలెక్షన్లు రాబట్టామా ? అనేదే చూస్తున్నారు. అలా ఉంటేనే ఆరోగ్యకరమైన పోటీ ఉంటుంది. నంబర్ వన్ పొజిషన్ అనేది ఎవరికి వారు డిసైడ్ చేసుకోకూడదు. ఫ్యాన్సే కాలానుగుణంగా నిర్ణయిస్తారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…